బిజినెస్

మార్కెట్లలో కొనుగోళ్ల జోరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జనవరి 22: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా నాలుగో సెషన్ లాభాల్లో ముగిశాయి. విదేశీ నిధులు పెద్ద మొత్తంలో స్టాక్ మార్కెట్‌లోకి తరలి రావడంతో పాటు దేశీయ మదుపరులు ఎడతెరిపి లేకుండా కొనుగోళ్లకు పూనుకోవడంతో మార్కెట్ కీలక సూచీలు సోమవారం సరికొత్త రికార్డు గరిష్ఠ స్థాయిల వద్ద ముగిశాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, ఓఎన్‌జీసీ, టీసీఎస్ వంటి బ్లూచిప్ కంపెనీల షేర్లు ఎక్కువగా మదుపరులను ఆకర్షించాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్ 286.43 పాయింట్లు పెరిగి, 35,798.01 పాయింట్ల వద్ద ముగియగా, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) నిఫ్టీ 10,966.20 పాయింట్ల వద్ద స్థిరపడింది. ఈ రెండు కీలక సూచీలు కూడా సోమవారం సరికొత్త జీవనకాల గరిష్ఠ స్థాయిల వద్ద ముగిశాయి. లీడింగ్ కంపెనీలు తృతీయ త్రైమాసికంలో అంచనాలకు మించిన లాభాలు ఆర్జించడంతో పాటు ఇటీవల జరిగిన వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) మండలి సమావేశంలో కొన్ని వస్తువులు, సేవలపై పన్ను రేట్లను తగ్గించడం వల్ల స్టాక్ మార్కెట్లలో ఉత్సాహపూరితమైన వాతావరణం నెలకొని కీలక సూచీలు రికార్డు స్థాయిలకు ఎగబాకాయి. సోమవారం ఉదయం పటిష్ఠమైన స్థాయి వద్ద ప్రారంభమైన సెనె్సక్స్ నిరాఘాటంగా పైకి ఎగబాకుతూ ఇంట్రా-డేలో ఆల్‌టైమ్ హై 35,827.70 పాయింట్లను తాకింది. అయితే, తరువాత మదుపరులు లాభాల స్వీకరణకు పూనుకోవడంతో క్రితం సెషన్ ముగింపుతో పోలిస్తే 286.43 పాయింట్లు (0.81 శాతం) పెరుగుదలతో 35,798.01 పాయింట్ల వద్ద ముగిసింది. శుక్రవారం నాటి ముగింపు రికార్డు 35,511.58 పాయింట్లను అధిగమించింది. క్రితం మూడు సెషన్లలో కలిపి ఈ సూచీ 740.53 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ కూడా సోమవారం ఇంట్రా-డేలో రికార్డు గరిష్ఠ స్థాయి 10,975.10 పాయింట్లను తాకింది. తరువాత స్వల్పంగా తగ్గి క్రితం సెషన్ ముగింపుతో పోలిస్తే 71.50 పాయింట్ల (0.66 శాతం) పెరుగుదలతో 10,966.20 పాయింట్ల వద్ద స్థిరపడింది. శుక్రవారం నాటి గరిష్ఠ ముగింపు రికార్డు అయిన 10,894.70 పాయింట్లను అధిగమించింది. ఇదిలా ఉండగా, క్రితం సెషన్‌లో ఫారిన్ పోర్ట్ఫోలియో ఇనె్వస్టర్లు (ఎఫ్‌పీఐలు) నికరంగా రూ. 988.25 కోట్ల విలువయిన షేర్లను, దేశీయ సంస్థాగత మదుపరులు (డీఐఐలు) రూ. 209.86 కోట్ల విలువయిన షేర్లను కొనుగోలు చేశారు.
సోమవారం సెనె్సక్స్ ప్యాక్‌లోని కంపెనీలలో టీసీఎస్ అత్యధికంగా 5.36 శాతం లాభపడింది. ఈ కంపెనీ షేర్ ధర సరికొత్త గరిష్ఠ స్థాయి రూ. 3,113.15కు చేరింది. తరువాత స్థానాన్ని రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆక్రమించింది. ఈ కంపెనీ షేర్ ధర 4.50 శాతం పెరుగుదలతో, రూ. 971.20కు చేరింది. హెచ్‌పీసీఎల్‌లోని ప్రభుత్వ వాటా 51.11 శాతాన్ని కొనుగోలు చేస్తున్న ఓఎన్‌జీసీ షేర్ ధర 3.28 శాతం పెరిగింది. మూడో త్రైమాసికంలో నికర లాభాన్ని 25 శాతం పెంచుకోవడంతో పాటు నిరర్ధక ఆస్తుల (ఎన్‌పీఏల)ను తగ్గించుకున్న యాక్సిస్ బ్యాంక్ షేర్ ధర 3.52 శాతం పుంజుకుంది.
లాభపడిన ఇతర కంపెనీలలో యెస్ బ్యాంక్, బజాజ్ ఆటో, ఎల్‌అండ్‌టీ, కోటక్ బ్యాంక్, అదాని పోర్ట్స్, టాటా మోటర్స్, సన్ ఫార్మా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఇన్ఫోసిస్, హీరో మోటోకార్ప్, డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరి ఉన్నాయి. వీటి షేర్ల విలువ 3.52 శాతం వరకు పెరిగింది. మూడో త్రైమాసికంలో నికర లాభాలు 8.4 శాతం పడిపోయిన విప్రో షేర్ విలువ 2.33 శాతం తగ్గింది. మదుపరులు లాభాల స్వీకరణకు పూనుకోవడంతో భారతి ఎయిర్‌టెల్, ఆసియన్ పెయింట్, హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్, ఎస్‌బీఐ, హింద్ యూనిలీవర్, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్ల ధరలు దిగజారాయి.