బిజినెస్

అమెరికాలో ‘షట్‌డౌన్’ ముగిసింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, జనవరి 23: అమెరికాలో మూడురోజులుగా ‘మూతపడిన ప్రభుత్వం’ తిరిగి మంగళవారం నాడు యథాస్థితికి చేరుకుంది. దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ద్రవ్య బిల్లుపై సంతకం చేయడంతో ‘షట్‌డౌన్’కు తెరపడింది. తాజా పరిణామాన్ని ఆయన ‘గొప్ప విజయం’గా అభివర్ణించుకున్నారు. నిర్ణీత కాలవ్యవధిలోగా ద్రవ్య వినిమయ బిల్లు సెనేట్ ఆమోదం పొందలేక పోవడంతో ఈనెల 19న అర్ధరాత్రి సమయంలో అమెరికా ప్రభుత్వం మూతపడింది. మిలటరీ, ఇతర అత్యవసర సేవలను ‘షట్‌డౌన్’ నుంచి మినహాయించగా మిగతా ప్రభుత్వ శాఖలన్నీ మూతపడ్డాయి. లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులకు వేతనం లేని సెలవులు ఇచ్చారు. ఈ పరిస్థితుల నుంచి దేశాన్ని గట్టెక్కించేందుకు ట్రంప్ ప్రయత్నాలు ప్రారంభించారు.
అమెరికాలో ‘డ్రీమర్ల’ భవిష్యత్ ప్రశ్నార్థకమైందన్న ఆగ్రహంతో విపక్ష డెమోక్రాట్లు ద్రవ్య వినిమయ బిల్లును అడ్డుకున్న సంగతి తెలిసిందే. అమెరికాలో విదేశీ ఉద్యోగుల పిల్లలను ‘డ్రీమర్లు’ (స్వాప్నికులు)గా పేర్కొంటున్నారు. ఎలాంటి పత్రాలు లేకుండా అమెరికాకు వలస వస్తున్న యువతను (డ్రీమర్ల)ను ఆదుకోవాలని డెమోక్రాట్లు పట్టుబడుతున్నారు. ‘డ్రీమర్ల’ భవిష్యత్‌పై చర్చించేందుకు డెమోక్రాట్లతో ట్రంప్ ఒప్పందం చేసుకోవడంతో ‘షట్‌డౌన్’ ముగిసింది. డెమోక్రాట్లను ట్రంప్ ప్రసన్నం చేసుకోవడంతో ఆయన ప్రతిపాదించిన ద్రవ్య బిల్లుకు అమెరికా ప్రతినిధుల సభలోని 266 మంది సభ్యుల్లో 150 మంది అనుకూలంగా ఓటు వేశారు. ఫిబ్రవరి 8 వరకూ తాత్కాలికంగా నిధులు విడుదల చేసేందుకు ఉద్దేశించిన బిల్లుకు సోమవారం రాత్రి డెమోక్రాట్ల మద్దతు పొందడంలో ట్రంప్ విజయం సాధించారు. ‘సెనేట్’లో నూ, ‘హౌస్’ (ప్రతినిధుల సభ)లో నూ ఆ బిల్లు ఆమోదం పొందింది. కాగా, పూర్తిస్థాయిలో ద్రవ్య వినిమయం, అక్రమ వలసలకు సంబంధించి కొద్దిరోజుల్లో తిరిగి చర్చలు జరిపేందుకు డెమోక్రాట్లకు, అధికార రిపబ్లికన్స్‌కు మధ్య ఒప్పందం కుదిరింది. డెమోక్రాట్లతో ఒప్పందం కుదరడంతో ‘షడ్‌డౌన్’ ముగిసి, అమెరికాలో మంగళవారం ప్రభుత్వ కార్యకలాపాలు యథావిధిగా ప్రారంభమయ్యాయి. షట్‌డౌన్’ ముగియడం రిపబ్లికన్లు సాధించిన గొప్ప విజయమని ట్రంప్ చెప్పుకున్నారు. ప్రభుత్వం తిరిగి పనిచేసేలా వివిధ శాఖలకు నిధులు విడుదల చేసేందుకు డెమోక్రాట్లు సహకరించడం శుభ పరిణామమని ఆయన అన్నారు. మిలటరీ, సరిహద్దు భద్రత, ఇతర కీలక రంగాల్లో నిధులు ఖర్చు చేసేందుకు ఇపుడు అవకాశం కలిగిందన్నారు. వలసవాదుల వల్ల దేశానికి మేలు జరుగుతుందని భావిస్తే ఆ విషయంలో దీర్ఘకాల ప్రణాళిక అమలు చేస్తామని, నిధుల ఖర్చుకు సంబంధించి ఆమోదం లభించడంతో సమస్యల పరిష్కారానికి అధికార యంత్రాంగం తగిన కృషి చేస్తుందన్నారు.