బిజినెస్

రాయలసీమ ఇక పారిశ్రామిక సీమ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జనవరి 23: దశాబ్దాలుగా నీరు లేక నిస్తేజమైన రాయలసీమ నేడు జలవనరులతో కళకళలాడుతోందని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అధికారంలోకి వచ్చిన నవ్యాంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాయలసీమ రూపురేఖలు మార్చి పారిశ్రామికాభివృద్ధికి బాటవేసిందని ఆంధ్రప్రదేశ్ ఐటీ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. అనంతపురం జిల్లాలో దక్షిణ కొరియా కంపెనీ కియా మోటార్స్ తన కార్ల ఫ్యాక్టరీని నెలకొల్పడమే ఇందుకు నిదర్శనమని లోకేష్ అన్నారు. నదుల అనుసంధానంతో రాష్ట్ర ప్రభుత్వం రాయలసీమకు మునుపెన్నడూ లేనంతగా నీరు తెచ్చిందని వివరించారు. అందువల్లనే అనంతపురం జిల్లా నేడు ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికాభివృద్ధికి ముఖ్య కేంద్రంగా రూపుదిద్దుకుంటోందని ఆయన చెప్పారు. నదుల అనుసంధానం దశాబ్దాలుగా ఒక కలగా మిగిలిందని, గోదావరి-కృష్ణా అనుసంధానం ద్వారా తాము చేసి చూపించామని లోకేష్ చెప్పారు. సమీప భవిష్యత్తులో మరిన్ని నదుల అనుసంధానం ద్వారా రాష్ట్రాన్ని అత్యున్నత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామన్నారు.
మంగళవారం స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో సీఐఐ, పీడబ్ల్యుసి సంయుక్తంగా నిర్వహించిన ‘ఇండస్ట్రియల్ కారిడార్స్ ఇన్ ఇండియా’ వ్యాపార విభాగ (బిజినెస్ సెషన్)లో మంత్రి నారా లోకేష్ ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్‌కు రెండు పారిశ్రామిక కారిడార్లు ఒక వరమని, వైజాగ్-చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, చెన్నై-బెంగుళూరు ఇండస్ట్రియల్ కారిడార్లని వ్యూహాత్మకంగా ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికాభివృద్ధి కోసం వినియోగించుకుంటున్నామని లోకేష్ వివరించారు. అనంతపురం జిల్లాలో జలవనరుల అభివృద్ధికి ప్రథమ ప్రాధాన్యతనిచ్చామని, అందుకే ప్రపంచ ప్రసిద్ధి చెందిన కియా మోటార్స్ సంస్థ ఈ జిల్లాలో కార్ల కంపెనీ ఏర్పాటుకు ముందుకు వచ్చిందని అన్నారు. వివిధ ప్రాంతాల్లో వనరులు, వౌలిక సదుపాయాల లభ్యతను అనుసరించి క్లస్టర్ల వారీగా పారిశ్రామికాభివృద్ధికి శ్రీకారం చుట్టినట్లు లోకేష్ వివరించారు. ఏపీలో ఏర్పాటు చేస్తున్న ఎలక్ట్రానిక్స్, సోలార్ క్లస్టర్లను ఉదహరించారు. ఎలక్ట్రానిక్స్ తయారీ రంగానికి అనువైన పరిస్థితులు సృష్టించడానికి ఉత్పాదక క్లస్టర్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. తిరుపతి ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్‌లో ఇప్పటికే సెల్కాన్, డిక్సన్, కార్బన్ లాంటి సంస్థలు కార్యకలాపాలు ప్రారంభించాయని ఐటీ మంత్రి లోకేష్ గుర్తుచేశారు, శ్రీసిటీ సెజ్‌లో ఫాక్స్‌కాన్ మొబైల్ తయారీ కంపెనీలో ఒకేచోట 12వేల మంది మహిళలకు ఉద్యోగాలు వచ్చాయని మంత్రి లోకేష్ తెలిపారు. మొబైల్ ఫ్యానుఫ్యాక్చరింగ్‌లో బ్యాటరీ తయారీ నుంచి పూర్తిస్థాయి మొబైల్ తయారీ వరకూ ఉన్న అన్ని విడి భాగాల తయారీ కంపెనీలతో క్లస్టర్ ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి వివరించారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో ప్రతికూల పరిస్థితులను సానుకూలంగా మార్చుకుని దేశ చరిత్రలోనే తొలిసారిగా రాష్ట్ర రాజధాని నిర్మాణానికి 35వేల ఎకరాల భూమిని సమీకరణ పద్ధతిలో తీసుకున్నామని, రాజధాని అమరావతి నిర్మాణంలో వారిని భాగస్వాములను చేశామని తెలిపారు.

చిత్రం..సదస్సులో పాల్గొన్న మంత్రి లోకేష్, తదితరులు