బిజినెస్

31న ‘హైసే’ వార్షిక సదస్సు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, మార్చి 24: హైదరాబాద్ సాఫ్ట్‌వేర్ ఎక్స్‌పోర్టర్స్ అసోసియేషన్ (హెచ్‌వైఎస్‌ఇఏ-హైసే) తన 24వ వార్షిక సదస్సు, 2016 అవార్డుల ప్రదానోత్సవాన్ని ఈ నెల 31న నిర్వహిస్తున్నట్లు హైసే అధ్యక్షుడు రమేష్ లోగనాథన్ తెలిపారు. స్థానిక నోవోటెల్‌లోని హెచ్‌ఐసిసిలో నిర్వహించే ఈ సదస్సులో 150 స్టార్టప్స్, 150 సాఫ్ట్‌వేర్ కంపెనీలకు చెందిన లీడర్లు, వివిధ విభాగాలకు చెందిన పారిశ్రామిక ప్రతినిధులు దాదాపు వెయ్యి మంది పాల్గొంటున్నట్లు ఆయన వెల్లడించారు. అవార్డుల కోసం వివిధ కేటగిరిలో దాదాపు 180 రకాల ఉత్పత్తులు పోటీపడినట్లు సంస్థ తెలిపింది. ఈ సదస్సు నిర్వహణ ద్వారా సాఫ్ట్‌వేర్ రంగంలో కొత్త ఆవిష్కరణలకు అవకాశం కలుగుతుందని రమేష్, ఎస్‌టిపిఐ డైరక్టర్ రామ్‌ప్రసాద్‌లు అభిప్రాయపడ్డారు.