బిజినెస్

రాష్ట్రానికి ఎమిరేట్స్ గ్రూపు, దుబాయ్ ఎయిరో స్పేస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, ఫిబ్రవరి 8: విమానయాన రంగంలో నవ్యాంధ్రప్రదేశ్ ఉజ్వలంగా వెలిగిపోనుంది. దుబాయ్‌కు చెందిన ఎమిరేట్స్, దుబాయ్ ఎయిరోస్పేస్ సంస్థలు రాష్ట్రంలో అడుగుపెట్టేందుకు ఆసక్తి కనబరుస్తున్నాయి. ఎయిర్‌క్రాఫ్ట్స్ తయారీ, విమానాల ఇంటీరియర్, డ్యూరబుల్స్ తయారీ కేంద్రాలను రాష్ట్రంలో ఏర్పాటు చేసేందుకు ఎమిరేట్స్ గ్రూపు ముందుకొచ్చింది. ఏవియేషన్ శిక్షణ కోసం ఒక అకాడమీని సైతం నెలకొల్పనుంది. దీంతోపాటు మెయింటెనెన్స్ రిపేర్ అండ్ ఓవర్‌హోల్ (ఎంఆర్‌ఆర్) సదుపాయాన్ని ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో ఏపీ ఈడీబీతో ఎమిరేట్స్ గ్రూపు అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఒప్పందం ప్రకారం ఎమిరేట్స్ గ్రూపు, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక అభివృద్ధి మండలి (ఏపీఈడీబీ) కలిసి వర్కింగ్ గ్రూపులను ఏర్పాటు చేస్తాయి. ఏరోస్పేస్ సంబంధిత వౌలిక సదపాయాలు, తయారీ పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలు, వాటిల్లో ‘ఏమిరేట్స్’ పెట్టుబడులు పెట్టేందుకు గల అవకాశాలను ఈ వర్కింగ్ గ్రూపులు పరిశీలిస్తాయి. అలాగే ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా ఏపీలో నైపుణ్యాభివృద్ధి, సామర్థ్యం పెంపులోనూ ఎమిరేట్స్, ఏపీఈడీబీ సంయుక్తంగా కలిసి పని చేస్తాయి. ఈ ఒప్పందం వాస్తవరూపం దాల్చితే, రాష్ట్రానికి కొత్తగా రూ. 30వేల కోట్ల మేర పెట్టుబడులు వచ్చేందుకు అవకాశం లభిస్తుంది. విమానయాన రంగంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి జాయింట్ వెంచర్ ప్రారంభించాలని గురువారం దుబాయ్‌లోని ఎమిరేట్స్ హెడ్‌క్వార్టర్స్‌లో తనతో సమావేశమైన ఎమిరేట్స్, దుబాయ్ నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్డ్ అసోసియేషన్ చైర్మన్ షేక్ అహ్మద్ బీన్ సరుూద్ అల్ మక్దూమ్‌ను ముఖ్యమంత్రి కోరారు. ఏపీ, అమరావతికి తమ విమాన సర్వీసులను ఆరంభించడానికి సన్నాహాలు చేస్తున్నామని, కానీ భారత ప్రభుత్వ నియమ నిబంధనలు ఇందుకు అడ్డంకిగా ఉన్నాయని మక్దూమ్ ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. భారత్ నుంచి దుబాయ్ రావడానికి ఇప్పుడు కేటాయిస్తున్న సీట్ల సంఖ్య పరిమితంగా ఉందని, పాత ఒప్పందాన్ని భారత ప్రభుత్వం సవరించాలని చెప్పారు. ఇండియన్ ఎయిర్‌లైన్స్, ఎమిరేట్స్ సంస్థలు రెండూ దీనిపై చర్చించి ఒక నిర్ణయానికి రావాల్సి ఉందన్నారు. విమానాలు ప్రయాణికులను చేరవేస్తాయి.. దాంతోపాటు ఆయా గమ్యస్థానాల్లో ఆ ప్రయాణికులు ఆర్థిక కార్యకలాపాలు సాగించేందుకు దోహదం చేసే ఏర్పాట్లు కూడా అవసరమే.. ముఖ్యంగా అక్కడికి వెళ్లిన వారు సేద తీరేందుకు తగిన వసతి, షాపింగ్ చేసేందుకు మాల్స్, సమావేశాలు జరిపేందుకు వీలుగా విశాలమైన మందిరాలు ఉండాలి.. పర్యాటకాభివృద్ధి అనేది ఎక్కడైనా కీలకం.. అదే ముఖ్యమని మక్దూమ్ తన అభిప్రాయాన్ని ముఖ్యమంత్రికి వెల్లడించారు. ఎయిర్‌లైన్ విజయవంతం కావడానికి ఒక మంచి పర్యావరణ వ్యవస్థను నిర్మించడం తప్పనిసరమని తెలిపారు. దుబాయ్‌లోని హోటళ్లలో లక్షకు పైగా గదులు అందుబాటులో వున్నాయని, జోర్దాన్ వంటి దేశంలో 14వేలకుపైగా హోటల్ గదులు ఉన్నాయని తెలిపిన మక్దూమ్, 2020 నాటికి దుబాయ్‌లో 1.50 లక్షల హోటల్ గదులు ఉంటాయని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రితో జరిగిన సమావేశంలో మక్దూమ్‌తోపాటు యుఏఈలో భారత రాయబారి నవ్‌దీప్ సూరి కూడా ఉన్నారు.
ఎయిరో సిటీ ఏర్పాటుకు
దుబాయ్ ఎయిరో స్పేస్ ఆసక్తి
దుబాయ్ ఎయిర్‌పోర్టు ఫ్రీ జోన్ అథారిటీ డైరెక్టర్ జనరల్, దుబాయ్ సిలికాన్ ఒయాసిస్ అథారిటీ వైస్ చైర్మన్, దుబాయ్ ఎయిరో స్పేస్ డైరెక్టర్ డాక్టర్ మహమ్మద్ అహ్మద్ ఆల్ ఝరానీతో గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో అంతర్జాతీయ స్థాయి ఎయిరో సిటీ ఏర్పాటు సన్నాహాల్లో ఉన్నామని, ఇందుకోసం సౌదీ అరేబియా ఫైనాన్షియర్స్‌తో కలిసి పనిచేస్తున్నామని ముఖ్యమంత్రికి ఝరానీ వెల్లడించారు. కేపీఎంజీ సహకారంతో మరో మూడు నెలల్లో దీనిపై సవివర ప్రాజెక్టు నివేదిక సిద్ధం చేస్తున్నట్టు చెప్పారు. ‘ఎయిర్ బస్’తో ఒప్పందం కుదుర్చుకున్నామని, నాసాతో సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపారు. విశాఖలో జరిగే సిఐఐ- భాగస్వామ్య సదస్సుకు హాజరవుతానని ఝురానీ మాటివ్వగా, నాటికల్లా స్పష్టమైన ప్రతిపాదనలతో రావాలని ముఖ్యమంత్రి సూచించారు. ముఖ్యమంత్రి బృందంలో ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు, ప్రభుత్వ సలహాదారు డాక్టర్ పరకాల ప్రభాకర్, ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి జి.సాయి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో
ఎంఓయు కుదుర్చుకుంటున్న ఎమిరేట్స్ గ్రూపు