బిజినెస్

సాంప్రదాయేతర ఇంధన వనరుల సమర్థ వినియోగంపై దృష్టి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 8: ప్రస్తుతం వినియోగంలోవున్న సాంప్రదాయ ఇంథన వనరులను కాపాడుకుంటూనే ప్రత్యామ్నాయంగా సాంప్రదాయేతర ఇంథన వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవడంపై ప్రపంచ దేశాలు దృష్టిసారించాలని తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో గురువారం ప్రారంభమైన అంతర్జాతీయ సదస్సు పిలుపునిచ్చింది. నీరు, బొగ్గు, గ్యాస్, పెట్రో ఉత్పత్తుల వినియోగం పెరగడంవల్ల అంతరించిపోయే ప్రమాదంతోపాటు భూతాపం పెరిగిపోతుండటంతో ప్రపంచవ్యాప్తంగా ప్రత్యామ్నా ఇంథన వనరులపై పరిశోథనలు సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రాజమహేంద్రవరం ఆర్ట్స్ కళాశాల వేదికగా మూడు రోజుల అంతర్జాతీయ సదస్సును నిర్వహిస్తున్నారు. అమెరికాలోని కాన్ సెంటర్ పునరుత్పాదక శక్తి కేంద్రం లూరుూస్ విల్లీ విశ్వవిద్యాలయంతో చేసుకున్న ఒప్పందం మేరకు ఈ అంతర్జాతీయ సదస్సు నిర్వహిస్తున్నారు. మొదటి రోజు కాన్ సెంటర్ శాస్తవ్రేత్తలు జోస్‌స్పర్జియన్, సీనల్‌స్కీ హాజరయ్యారు.
భావితరాలకు ప్రత్యామ్నాయ ఇంథనంగా భావిస్తున్న పునరుత్పాదక శక్తి వనరులపై జరుగుతున్న పరిశోధనా ఫలితాలను విద్యార్థులు, ఇతర శాస్తవ్రేత్తలతో పంచుకోవడానికి ఈ సదస్సును ఏర్పాటుచేశారు. దీనికి తోడు సౌర విద్యుత్‌ను నిల్వ చేసే విధానంపై కూడా పరిశోధనలు సాగుతున్నట్టు తెలిపారు. ఈ పరిశోధనా ఫలితాలపై ప్రపంచ దేశాలు ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నాయన్నారు. మూడు రోజుల పాటు జరగనున్న ఈ అంతర్జాతీయ సదస్సులో కీలకమైన పరిశోధనా ఫలితాలపై చర్చించి విద్యార్థులతో శాస్తవ్రేత్తలు పంచుకుంటారని సదస్సు కన్వీనర్ డాక్టర్ కె రామచంద్రరావు, ఆర్ట్సు కాలేజి ప్రిన్సిపాల్ డాక్టర్ డేవిడ్‌కుమార్ తెలిపారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో నన్నయ యూనివర్సిటీ వైస్-్ఛన్సలర్ డాక్టర్ ముర్రు ముత్యాలనాయుడు, ఉన్నత విద్యా శాఖ జాయింట్ డైరెక్టర్ ఎన్ గీతాంజలి, కాలేజి విద్య ఆర్జేడీ కె ప్రవీణ్, కాలేజి ఎడ్యుకేషన్ ప్రత్యేక అధికారి రవిచంద్రకుమార్ తదితరులు పాల్గొన్నారు.