బిజినెస్

స్టాక్ మార్కెట్‌కు ఉపశమనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఫిబ్రవరి 8: కార్పొరేట్ కంపెనీల మూడో త్రైమాసిక ఫలితాలు, ఆసియన్ మార్కెట్లలో పరిస్థితి సానుకూలంగా ఉండటంతో గురువారం దేశీయ స్టాక్ మార్కెట్లు ఊపిరి పీల్చుకున్నాయి. వరుసగా ఏడు రోజుల పాటు చవిచూసిన నష్టాలకు తెరదించి, గురువారం లాభాల్లో ముగిశాయి. కీలక మార్కెట్ సూచీలు పైకి ఎగబాకాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్ 330 పాయింట్లు (0.97 శాతం) పుంజుకొని, 34,413.16 పాయింట్ల వద్ద ముగిసింది. గత రెండు వారాలలో సెనె్సక్స్ ఒకే సెషన్‌లో ఇంత ఎక్కువగా పెరగడం ఇదే మొదటిసారి. దేశీయ, ప్రపంచ పరిణామాలు ప్రతికూలంగా ఉండటంతో ఈ సూచీ గత ఏడు సెషన్లలో కలిపి 2,200.54 పాయింట్లు పడిపోయింది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) నిఫ్టీ గురువారం వంద పాయింట్లు (0.96 శాతం) పుంజుకొని, 10,576.85 పాయింట్ల వద్ద స్థిరపడింది. ఇటీవల ధరలు బాగా పడిపోయిన బ్యాంకింగ్ షేర్లను మదుపరులు ఎక్కువగా కొనుగోలు చేశారు. దీంతో ఈ షేర్ల ధరలు పెరిగాయి. ఫార్మా, ఐటీ రంగాల షేర్ల ధరలు కూడా పుంజుకున్నాయి. ఆర్థిక వ్యవస్థ అంచనా వృద్ధి రేటు పెరగడంతో పాటు ముడి చమురు ధరలు తగ్గడం కూడా మదుపరుల సెంటిమెంట్‌ను బలోపేతం చేసింది. బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ ఆరు వారాల కనిష్ట స్థాయి, బారెల్‌కు 65.16 డాలర్లకు పడిపోయింది. తనకు అవసరం ఉన్న చమురులో అధిక భాగం దిగుమతి చేసుకుంటున్న భారత్‌కు ముడి చమురు ధర తగ్గడం సానుకూలాంశం. వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) అమలు స్థిరీకరణ పొందడంతో వచ్చే ఆర్థిక సంవత్సరం ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు 7.2 శాతం నమోదవుతుందని రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) బుధవారం తన ద్రవ్య విధాన సమీక్షలో అంచనా వేయడం దేశీయ స్టాక్ మార్కెట్‌కు ఊతమిచ్చింది. సెనె్సక్స్ గురువారం 34,208.11 పాయింట్ల అధిక స్థాయి వద్ద ప్రారంభమయి, గరిష్ఠ స్థాయి 34,634.35 పాయింట్లు, కనిష్ట స్థాయి 34,108.76 పాయింట్ల మధ్య కదలాడింది. చివరకు 34,413.16 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా గురువారం కీలకమైన 10,550 స్థాయిపైన 10,576.85 పాయింట్ల వద్ద ముగిసింది. క్రితం ముగింపుతో పోలిస్తే ఈ సూచీ 100.15 పాయింట్లు పుంజుకుంది. ఈ సూచీ అంతకు ముందు ఇంట్రా-డేలో గరిష్ఠ స్థాయి 10,637.80, కనిష్ట స్థాయి 10,479.55 పాయింట్ల మధ్య కదలాడింది. ఇదిలా ఉండగా, బుధవారం దేశీయ సంస్థాగత మదుపరులు (డీఐఐలు) నికరంగా రూ. 461.19 కోట్ల విలువయిన షేర్లను కొనుగోలు చేయగా, ఫారిన్ ఫండ్స్ రూ. 1,022.50 కోట్ల విలువయిన షేర్లను విక్రయించాయి. గురువారం నాటి లావాదేవీల్లో సెనె్సక్స్ ప్యాక్‌లోని సంస్థల్లో సన్ ఫార్మా అత్యధికంగా 6.32 శాతం లాభపడింది. డాక్టర్ రెడ్డీస్ 3.18 శాతం లాభపడింది. ఎస్‌బీఐ, ఇన్ఫోసిస్, యాక్సిస్ బ్యాంక్, టాటా స్టీల్, హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్, హిందుస్తాన్ యూనిలీవర్, కోటక్ బ్యాంక్, మారుతి సుజుకి, ఎల్‌అండ్‌టీ, రిలయన్స్, ఎంఅండ్‌ఎం, కోల్ ఇండియా, బజాజ్ ఆటో, ఐసీఐసీఐ బ్యాంక్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, యెస్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, టీసీఎస్, హీరో మోటోకార్ప్, ఆసియన్ పెయింట్స్, విప్రో 2.97 శాతం వరకు లాభపడ్డాయి. మూడో త్రైమాసికంలో నికర లాభం ఏడు శాతం పెరిగిన ఔషధ దిగ్గజం సిప్లా షేర్ ధర 7.83 శాతం పెరిగింది. గురువారం నాటి లావాదేవీల్లో నష్టపోయిన సంస్థల్లో పవర్ గ్రిడ్, ఎన్‌టీపీసీ, టాటా మోటార్స్, ఓఎన్‌జీసీ, అదాని పోర్ట్స్, ఐటీసీ లిమిటెడ్, భారతి ఎయిర్‌టెల్ ఉన్నాయి.