బిజినెస్

విశాఖ విమానాశ్రయంలో విదేశీ మారక సేవలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఫిబ్రవరి 8: విశాఖ విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగించే ప్రయాణికులకు ఫారెక్స్, యాత్రా సేవలు ఇపుడు మెరుగైన రేట్లతో అందుబాటులోకి వస్తున్నాయి. భారతదేశంలో ప్రముఖ ఫారెన్ ఎక్సెంజ్ కంపెనీ, సెంట్రల్ గ్రూప్‌లో భాగమైన సెంట్రమ్ డైరెక్ట్ సంస్థ విశాఖ విమానాశ్రయంలో విదేశీ మారక సేవలను అందించేందుకు హక్కులు పొందింది. విశాఖ విమానాశ్రయంలో ప్రారంభమైన ఫారెక్స్ కౌంటర్ ద్వారా నగరంలోకి వచ్చీపోయే ప్రయాణికులకు విదేశీ మారకాన్ని మెరుగైన రేట్లతో ఈ సంస్థ అందించనుంది. వీటితోపాటు ట్రావెలెర్స్ చెక్స్, మల్టీ-కరెన్సీ ప్రీ పెయిడ్ కార్డులు, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ వంటి పలు రకాల సేవలు అందించనుంది. విశాఖకు అన్నింటికంటే ప్రధానంగా ఓడరేవు దగ్గరగా ఉన్నందున ఇది ఒక ప్రధాన వాణిజ్యకేంద్రంగా భాసిల్లుతోంది. ఇది భారతదేశంలోనే రెండవ అతిపెద్ద ఓడరేవుఅయినందున వాణిజ్య పర్యాటకులను పెద్ద సంఖ్యలో ఆకర్షించగలుగుతోంది. అలాగే అంతర్జాతీయ విమానాలు కూడా నగరానికి నేరుగా కనెక్టివిటీని అందిస్తున్నాయి. ప్రస్తుతం ఏపీలో తమకు మూడు బ్రాంచీలున్నాయని సెంట్రమ్ సంస్థ సీఈవో, ఎండీ టీసి గురుప్రసాద్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తమ కార్యకలాపాలు గణనీయంగా విస్తరించే ప్రణాళికలున్నాయని, సెంట్రమ్ డైరెక్ట్ కరెన్సీ నోట్లు, మల్టీ కరెన్సీ ట్రావెల్ కార్డ్స్, రెమిటెన్స్ సర్వీసెస్, ట్రావెలర్స్ చెక్స్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ వంటి విస్తృత శ్రేణికి చెందిన వివిధ సేవలను అందిస్తుందన్నారు. విదేశీ మారక కొనుగోలు, అమ్మకాలను ఆన్‌లైన్ పోర్టల్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.సెంట్రమ్‌ఫారెక్స్.కామ్ ద్వారా నిర్వహిస్తుంది. విశాఖ విమానాశ్రయం గత ఏడాదితో పోల్చినట్లయితే 30 శాతం వృద్ధిని సాధించి, 2016-17 ఆర్ధిక సంవత్సరానికిగాను 23 లక్షల మంది ప్రయాణికులకు తమ సేవలు అందించింది.కాగా విమానాశ్రయంలో ఫారెక్స్ కౌంటర్‌ను విశాఖ విమానాశ్రయం డైరెక్టర్ జి.ప్రకాష్‌రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు.