బిజినెస్

వేతన జీవులకు, సీనియర్ సిటిజన్లకు రూ. 12వేల కోట్ల లబ్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 8: రానున్న ఆర్థిక సంవత్సరం కోసం ఇటీవల లోక్‌సభలో తాను ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో వేతన జీవులు, సీనియర్ సిటిజన్లకు రూ. 12వేల కోట్ల లబ్ధి చేకూర్చడం జరిగిందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. ఈక్విటీలపై ఆర్జించే లాభాలపై పది శాతం లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ (ఎల్‌టీసీజీ) పన్ను విధించడాన్ని ఆయన గట్టిగా సమర్థించుకున్నారు. లోక్‌సభలో 2018-19 బడ్జెట్‌పై జరిగిన చర్చకు గురువారం జైట్లీ సమాధానమిస్తూ తమ ప్రభుత్వం చేపట్టిన పెద్ద నోట్ల రద్దు, వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) అమలు వల్ల మధ్య కాలంలో, దీర్ఘ కాలంలో ఆర్థిక వ్యవస్థకు మేలు చేకూరుతుందన్నారు. ఈ చర్యల ఫలితంగా వచ్చే ఆర్థిక సంవత్సరం నాటికి భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న దేశంగా అవతరిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 2014 మేలో ఎన్‌డీఏ ప్రభుత్వం ఏర్పాటయ్యాక దేశంలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయని ఆయన చెప్పారు. అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్) అంచనా ప్రకారం, భారత్ కేవలం 0.1 శాతం తేడాతో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ అనే ట్యాగ్‌ను కోల్పోయిందని జైట్లీ తెలిపారు. అయితే భవిష్యత్తులో భారత్ అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఎన్‌డీఏ అధికారంలోకి వచ్చాకే, దేశ ఆర్థిక వ్యవస్థ ఎంతో మెరుగుపడిందని పేర్కొంటూ ఆయన గత యుపీఏ ప్రభుత్వ పనితీరుపై విరుచుకుపడ్డారు.