బిజినెస్

టీ. పరిశ్రమల విధానం దేశానికే ఆదర్శం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 10: తెలంగాణ రాష్ట్రం పారిశ్రామిక పెట్టుబడులను ఆకర్షించడంలో అంతర్జాతీయ స్థాయిలో పోటీపడుతుందని, పరిశ్రమలకు అవసరమైన వౌలిక సదుపాయాలను కల్పిస్తున్నట్లు ఐటి శాఖ మంత్రి కెటి రామారావు అన్నారు. శనివారం ఇక్కడ భారతీయ పరిశ్రమల సమాఖ్య (సిఐఐ) సదరన్ రీజియన్ కౌన్సిల్ సభ్యులతో ఆయన సమావేశమై రాష్ట్రంలో పరిశ్రమల విధానాలను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పరిపాలన, పరిశ్రమల రంగంలో ఉన్నత స్థాయిలో సంస్కరణలు తెచ్చామన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, వాణిజ్య సంస్కరణలు, పరిశ్రమల రంగంలో మార్పులు, సమృద్ధిగా విద్యుత్ లభ్యత వల్ల పెట్టుబడుల ప్రవాహం పెరిగిందన్నారు. 14 ప్రధాన సెక్టార్లను ఫోకస్ చేసేందుకు ప్రణాళిక ఖరారు చేసినట్లు చెప్పారు. ఐటి ఎగుమతుల్లో దేశంలో అగ్ర స్థానంలో ఉందన్నారు. లైఫ్ సైనె్సస్, బల్క్ డ్రగ్స్, కెమికల్స్, ఫార్మా, న్యూ యేజ్ మెడికల్ డివైజస్, ఐటి ఉత్పత్తుల్లో తెలంగాణ దూసుకుపోతోందన్నారు. ఆర్థికాభివృద్ధిరేటులో 18 నుంచి 19 శాతం నమోదైందన్నారు. టి హబ్‌కు తెలంగాణ కేంద్రంగా నిలిచిందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఐటి దిగ్గజాలు ఈ హబ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయన్నారు. టి వర్క్ అనే ప్రోటోటైపింగ్ ల్యాబ్‌ను ప్రారంభించనున్నట్లు చెప్పరు. త్వరలో తమ ప్రభుత్వం విద్యుత్ వాహనాల విధానాన్ని ప్రవేశపెట్టనున్నట్లు చెప్పారు. ఏరోస్పేస్, రక్షణ సంస్థల్లో పెట్టుబడులు బాగా వస్తున్నాయన్నారు.

చిత్రం..సదరన్ రీజియన్ కౌన్సిల్ సభ్యులతో సమావేశమైన కేటీఆర్