బిజినెస్

స్వల్పంగా తగ్గిన చిల్లర థ్రవ్యోల్బణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 12: కూరగాయలు, పళ్లు, ఇంధన ధరలు తగ్గడం వల్ల జనవరి నెలలో చిల్లర ద్రవ్యోల్బణం స్వల్పంగా తగ్గి, 5.07 శాతానికి చేరుకుందని అధికారిక గణాంకాలు వెల్లడించాయి. వినియోగ వస్తువుల ధరల సూచీ (సీపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం 2017 డిసెంబర్ నెలలో 5.21 శాతం ఉండింది. ఇది 17 నెలల గరిష్ఠ స్థాయి. 2017 జనవరిలో ఇది 3.17 శాతం ఉండింది. అలాగే, సెంట్రల్ స్టాటిస్టిక్స్ కార్యాలయం (సీఎస్‌ఓ) సోమవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం, 2017 డిసెంబర్‌లో 4.96 శాతం ఉన్న కన్స్యూమర్ ఫుడ్స్ ధరల పెరుగుదల రేటు 2018 జనవరి నెలలో 4.7 శాతానికి తగ్గింది. డిసెంబర్‌లో 29.13 శాతం ఉన్న కూరగాయల ధరల ఆధారిత ద్రవ్యోల్బణం జనవరిలో 26.97 శాతానికి తగ్గింది. పళ్ల ధరల పెరుగుదల రేటు కూడా తక్కువ వేగంతో పెరిగింది. 2017 డిసెంబర్‌లో 6.63 శాతం ఉన్న ఇది జనవరి నెలలో 6.24 శాతానికి తగ్గింది. ఇంధనం, లైట్ సెగ్మెంట్‌కు సంబంధించి డిసెంబర్‌లో 7.90 శాతం ఉన్న ద్రవ్యోల్బణం జనవరి నెలలో 7.73 శాతానికి తగ్గింది. ఎన్‌ఎస్‌ఎస్‌ఓకు చెందిన ఫీల్డ్ ఆపరేషన్స్ డివిజన్ ఎంపిక చేసిన పట్టణాల నుంచి, డిపార్ట్‌మెంట్ ఆఫ్ పోస్ట్స్ ఎంపిక చేసిన గ్రామాల నుంచి ధరల గణాంకాలను సేకరించింది.