బిజినెస్

విమానయానంలో భారత్‌కు మూడో స్థానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, ఫిబ్రవరి 12: ప్రపంచ విమానయాన రంగంలో భారత్ మూడో స్థానంలో ఉందని కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రి అశోక్‌గజపతిరాజు అన్నారు. సోమవారం ఆయన పట్టణంలో నూతనంగా నిర్మించిన అవినీతి నిరోధక శాఖ కార్యాలయ నూతన భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా తనను కలిసిన విలేఖరులతో ఆయన మాట్లాడుతూ ఒకప్పుడు భారత్ విమానయాన రంగంలో అట్టడుగు స్థానంలో ఉండేదన్నారు. తాను అధికారంలోకి వచ్చిన తరువాత అర్థంలేని నిబంధనలను, అభ్యంతరాలను తొలగించామన్నారు. దాని వల్ల మంచి ఫలితాలు లభించాయన్నారు. అందువల్లే విమానయాన రంగంలో అట్టడుగు స్థానం నుంచి అతి వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మూడోస్థానానికి భారత్ చేరుకుందన్నారు. భోగాపురంలో ఎంవోఆర్ (మెయింటెనెన్స్ రిపేర్ ఆపరేషన్స్)ను కూడా ఏర్పాటు చేయాలన్న ఆలోచనతో ముందుగా పిలిచిన టెండర్లను రద్దు చేశామన్నారు. ఇదిలా ఉండగా భారత్ ప్రతి ఏటా విమానాల మరమ్మతుల నిర్వహణకు ఇతర దేశాలపై ఆధారపడాల్సి వస్తోందని, అందుకనే అదే ఎంవోఆర్‌ను భోగాపురంలో ఏర్పాటు చేయగలిగితే ఇతర దేశాలు మనపై ఆధారపడే పరిస్థితి ఉంటుందన్నారు. దీనివల్ల ఆయా దేశాల నుంచి మనకు ఏటా 750 మిలియన్ డాలర్ల ఆదాయం లభించే అవకాశం ఉందని వివరించారు. ప్రస్తుతం ఈ సదుపాయం శ్రీలంక, సింగపూర్, దుబాయ్ వంటి దేశాల్లో మాత్రమే ఉందన్నారు. ఎంవోఆర్ ఏర్పాటు చేస్తే ఉద్యోగావకాశాలు కూడా పెరుగుతాయన్నారు.