బిజినెస్

ఆర్థికేతర ఫిర్యాదులను త్వరగా పరిష్కరించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 12: రాష్ట్రంలో ప్రజల నుండి జన్మభూమి, ఇతర సందర్భాల్లో వచ్చిన ఆర్థికేతర ఫిర్యాదులన్నింటినీ త్వరితగతిన పరిష్కరించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) దినేష్‌కుమార్ అధికారులను ఆదేశించారు. గ్రీవెన్స్ ఫిర్యాదుల పరిష్కారం, ముఖ్యమంత్రి హామీల అమలుపై సోమవారం వెలగపూడి సచివాలయంలో ఆయన సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులన్నింటినీ నిర్దిష్ట వ్యవధిలోగా సకాలంలో పరిష్కరించాలన్నారు. ముఖ్యంగా ఆర్థికేతర ఫిర్యాదులన్నిటినీ వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. అలాగే ఆర్థికపరమైన ఫిర్యాదులు, వినతులు ఇంకా ఎన్ని పరిష్కరించాల్సి ఉంది.. వాటికి ఎంతమేరకు నిధులు అవసరమనే దానిపై ఆయా శాఖలవారీగా ఒక నివేదికను సిద్ధం చేసి వాటిని కూడా త్వరగా పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని చెప్పారు. ఈ అంశానికి సంబంధించిన ఫిర్యాదులను ప్రత్యేకంగా పర్యవేక్షించేందుకు రియల్ టైమ్ గవర్నెన్స్‌లో ప్రత్యేకంగా ఒక అధికారిని ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. అంతేగాక శాఖాధిపతుల వారీగా పెండింగ్ వివరాల జాబితా సిద్ధం చేయాలని ఆదేశించారు.