బిజినెస్

విశ్వానికి తెలిసేలా విశాఖ భాగస్వామ్య సదస్సు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, ఫిబ్రవరి 15: ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమల ఏర్పాటుకు ముందుకొచ్చేవారికి రియల్ టైమ్ గవర్నెన్స్ ద్వారా సత్వరం అనుమతులు ఇస్తున్న విధానాన్ని, వౌలిక వసతులు కల్పిస్తున్న తీరును ప్రపంచానికి తెలిసేలా విశాఖ భాగస్వామ్య సదస్సును సద్వినియోగం చేసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారులకు సూచించారు. కియా కార్ల నుంచి ఫాక్స్‌కాన్ సెల్‌ఫోన్లు వరకు రాష్ట్రంలో తయారవుతున్న వివిధ ఉత్పత్తులను ఈసారి సదస్సులో ప్రదర్శించాలని చెప్పారు. ఈ 24 నుంచి 26 వరకు మూడు రోజులపాటు నిర్వహించే సీఐఐ భాగస్వామ్య సదస్సు ఏర్పాట్లపై గురువారం సచివాలయంలో ముఖ్యమంత్రి సమీక్షించారు. ఆటోమొబైల్, ఏరోస్పేస్, డిఫెన్స్ పరిశ్రమల నమూనా ప్రదర్శన ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. స్మార్ట్ పవర్ గ్రిడ్, ఎలక్ట్రిక్ వెహికిల్స్, డిజరప్టివ్ టెక్నాలజీ, సోలార్ స్టోరేజ్ రంగాలకు చెందిన వారిని సదస్సులో భాగస్వాముల్ని చేయాలని నిర్దేశించారు. మన వంటలను, ఆహార పదార్థాలను, అరకు కాఫీని ప్రమోట్ చేసుకోవాల్సిన సమయం ఇదేనని ముఖ్యమంత్రి అధికారులకు స్పష్టం చేశారు. సదస్సుకు విచ్చేసే అతిధులకు నేచురల్ ఫార్మింగ్ ఫుడ్ అందించడం ద్వారా రాష్ట్రానికి బ్రాండ్ ఇమేజ్ తీసుకురావాలని చెప్పారు. ‘పెట్టుబడి లేని సహజ వ్యవసాయం’ గురించే దావోస్‌లో అంతా మాట్లాడారని, విశాఖ భాగస్వామ్య సదస్సు గురించి అలానే చెప్పుకోవాలని అన్నారు. మన కూచిపూడి నృత్యంతో ఆహూతులను ఆకట్టుకోవాలని చెప్పారు. ఉప రాష్టప్రతి ఎం.వెంకయ్యనాయుడు చేతుల మీదుగా సీఐఐ భాగస్వామ్య సదస్సు ప్రారంభం కానుంది. మొత్తం జరిగే తొమ్మిది ప్లీనరీ సెషన్లకు కేంద్ర మంత్రులు సురేష్‌ప్రభు, ఎంజె అక్బర్, నితిన్ గడ్కరీ, అశోక్ గజపతిరాజు, వైఎస్ చౌదరి, ధర్మేంద్ర ప్రదాన్, హర్షవర్ధన్, రవిశంకర్ ప్రసాద్, విజయ్ గోఖలే, మనోజ్ సిన్హా, నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ అజయ్‌కుమార్, నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ ఖాన్, సీఐఐ డైరక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ హాజరుకానున్నారు. అలాగే బంగ్లాదేశ్, కెనడా, జపాన్, జోర్డాన్, మయన్మార్, మారిషస్, మొరాకో, సింగపూర్, శ్రీలంక, టాంజానియా, థాయ్‌ల్యాండ్, యూఏఈ, జాంబియా దేశాలకు చెందిన మంత్రులు పాల్గొంటారు. 36 దేశాలకు చెందిన పారిశ్రామిక, వాణిజ్య ప్రముఖులు సదస్సుకు హాజరవుతారని ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు.