బిజినెస్

రూ. 8వేల కోట్లు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15: రూ. 11,400 కోట్ల భారీ మొత్తంలో మోసపోయిన పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ) రెండు రోజుల వ్యవధిలో రూ. 8వేల కోట్ల వరకు తన మార్కెట్ విలువను కోల్పోయింది. బ్యాంకు ఒక సంవత్సర కాలంలో సాధించిన లాభానికి ఇది ఆరు రెట్లు ఎక్కువ. దేశీయ స్టాక్ మార్కెట్‌లో వరుసగా రెండో రోజు గురువారం కూడా పీఎన్‌బీ షేర్ల ధర పడిపోయింది. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ)లో గురువారం సెషన్ ముగిసే సమయానికి పీఎన్‌బీ షేర్ ధర 12 శాతం పడిపోయి, రూ. 128.35కు దిగజారింది. ముంబయిలో తన ఒక శాఖలో భారీ స్థాయిలో మోసపూరిత లావాదేవీ జరిగినట్లు పీఎన్‌బీ ప్రకటించిన తరువాత బుధవారం ఆ బ్యాంక్ షేర్ విలువ పది శాతం పడిపోయింది.
ఈ రెండు రోజులలో పీఎన్‌బీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 8,076.59 కోట్లు పడిపోయి, రూ. 31,132.41 కోట్లకు దిగజారింది. పీఎన్‌బీ 2016-17 ఆర్థిక సంవత్సరంలో సాధించిన నికర లాభం రూ. 1,324 కోట్లతో పోలిస్తే ఆరు రెట్లకు పైగా దాని మార్కెట్ విలువ పడిపోయింది. మోసపూరిత లావాదేవీలో పీఎన్‌బీ కోల్పోయిన మొత్తం సొమ్ము ఆ బ్యాంకు వార్షిక లాభంతో పోలిస్తే ఎనిమిది రెట్లు ఎక్కువ. ఇదిలా ఉండగా, బీఎస్‌ఈలో గురువారం పీఎన్‌బీ హౌసింగ్ ఫైనాన్స్ షేర్ ధర 4.30 శాతం పడిపోయి, రూ. 1199లకు దిగజారింది.