బిజినెస్
మోటో జెడ్ 2 విడుదల
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Sunday, 18 February 2018
విజయవాడ, ఫిబ్రవరి 17: స్మార్ట్ ఫోన్ అనుభవాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకువెళ్లే దిశలో మోటోరొలా సరికొత్త స్మార్ట్ ఫోన్ లిమిటెడ్ ఎడిషన్ మోటో జెడ్ 2 ఫోర్స్‌ను, టర్బో పవర్ ప్యాక్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది.
ఈ నెల 16 అర్ధరాత్రి నుంచి మోటో పబ్‌ల్లోనూ, ఫ్లిప్ కార్ట్‌లోనూ రూ.34,999లకు ఈ ఫోన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. పగిలిపోని, ముక్కలు కాని డిస్‌ప్లే స్క్రీన్ దీని ప్రత్యేకత. రెండు రోజుల పాటు డిశ్చార్జి కాని 6220 ఎఎంహెచ్‌ల సామర్థ్యం బ్యాటరీ దీని సొంతం. 12 ఎంపీ డ్యూయల్ కెమేరా, వేగవంతమైన డేటా స్పీడ్, క్వాల్‌కాంలోని అత్యంత వేగపు స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్‌తో అత్యున్నత ఆవిష్కరణల కొలమానాన్ని సృష్టించింది.