బిజినెస్

తిరోగమనంలో గీతాంజలి షేర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 19:పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో రూ.11,400 కోట్ల కుంభకోణానికి సంబంధించి సీబీఐ, ఈడీ వంటి సంస్థల నిఘా, దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో మదుపరుల సెంటిమెంట్ గందరగోళ పరిస్థితుల్లో చిక్కుకోవడంతో స్టాక్‌మార్కెట్‌లో ఆటుపోట్లు కొనసాగుతున్నాయి. ప్రధానంగా నీరవ్‌మోదీకి చెందిన ‘గీతాంజలి జెమ్స్’ షేర్ల విలువ గణనీయంగా పతనమైంది. బీఎస్‌ఈలో దీని షేర్ల విలువ 9.99 శాతం మేరకు, అంటే ఒక్కో షేరు విలువ రూ. 33.75కు పడిపోయింది. మరోవైపు ఎన్‌ఎస్‌ఈలోనూ ఇదే ధోరణి కనిపించింది. గీతాంజలి జెమ్స్ షేరు విలువ 9.87 శాతం మేరకు అంటే 33.75కు పడిపోయింది. గడచిన నాలుగు సెషన్సలో 46 శాతం మేరకు, అంటే రూ.344 కోట్ల విలువైన షేర్లను ఆ సంస్థ నష్టపోయింది. బంగారు ఆభరణాల తయారీ సంస్థలైన త్రిభువనదాస్ భీమ్‌జీ జవేరీ 3.80, థంగమాయిల్ జ్యూయలరీ 1.84, పీసీ జ్యూయలర్ 1.42 శాతం మేరకు బీఎస్‌ఈలో నష్టపోయాయి. పీఎన్‌బీలో భారీ కుంభకోణంలో నిందితుడైన నీరవ్‌మోదీ దగ్గరి బంధువుతో కలసి గీతాంజలి జెమ్స్‌కు ఈ కేసుతో సంబంధం ఉందని దర్యాప్తు సంస్థలు భావిస్తున్నాయి.