బిజినెస్

ప్రపంచవ్యాప్తంగా 4.4 శాతం పెరగనున్న ప్రకటనల ఖర్చు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మార్చి 24: ప్రపంచవ్యాప్తంగా ప్రకటనలపై చేసే వ్యయం ఈ ఏడాది గత ఏడాదితో పోలిస్తే 4.4 శాతం పెరిగి 561 మిలియన్ డాలర్లకు చేరుకోవచ్చని, ఆన్‌లైన్ మార్కెటింగ్ ప్రకటనలపై చేసే ఖర్చులో మొబైల్ ఫోనే ప్రధాన పాత్ర వహించనుందని అంతర్జాతీయ మార్కెటింగ్ ఇంటెలిజన్స్ సంస్థ వార్క్ అభిప్రాయ పడింది. మొబైల్ ద్వారా ఖర్చు చేయడం గణనీయంగా పెరగనున్నప్పటికీ దాదాపుగా అన్ని ప్రాంతాల్లోను ఆర్థిక వృద్ధి మందగించనున్నందున ప్రకటనలపై చేసే ఖర్చువృద్ధి వచ్చే ఏడాది 3.7 శాతానికి తగ్గిపోవచ్చని కూడా ఆ సంస్థ అంచనా వేసింది. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి వాతావరణం ఉన్నప్పటికీ ప్రపంచవ్యాప్తంగా వినియోగదారులు ఖర్చు చేయడం ఈ ఏడాది, వచ్చే ఏడాది కూడా పెరగనుందని,దీనితో పాటుగా వినియోగదారులను ప్రభావితం చేసే ఉద్దేశంతో ప్రకటనలపై చేసే ఖర్చు కూడా పెరగవచ్చని వార్క్ రీసెర్చ్ విశే్లషకుడు జేమ్స్ మెక్‌డొనాల్డ్ చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా డెస్క్‌టాప్ ఇంటర్నెట్‌పై ప్రకటనల వ్యయం 112 బిలియన్ డాలర్లుగానే నిలకడగా ఉందని, ఈ ఏడాదినుంచి అది తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని ఆ సంస్థ అభిప్రాయ పడింది. 2017లో మొబైల్ ఫోన్లకు సంబంధించిన యాడ్స్‌పై మొత్తం 90 బిలియన్ డాలర్లు అంటే మొత్తం ఆన్‌లైన్ యాడ్ పెట్టుబడుల్లో 44 శాతం ఖర్చు చేయనున్నారని ఆ సంస్థ అంచనా వేసింది. ప్రపంచవ్యాప్తంగా మొబైల్ సోషల్ ఫార్మాట్‌లు, మొబైల్ వీడియోలకు కేటాయించే యాడ్స్ పెట్టుబడులు కూడా శరవేగంగా పెరుగుతున్నాయని, 2017లో ఈ పెట్టుబడులు వరసగా 28 బిలియన్ డాలర్లు, 10 బిలియన్ డాలర్లు ఉండవచ్చని ఆ సంస్థ తెలిపింది.