బిజినెస్

పీఎన్‌బీ స్కామ్ 12,646 కోట్లకు మించదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మార్చి 8: పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణం మొత్తం విలువ రూ.12,464 కోట్లకు మించే అవకాశం లేదని ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి సుభాష్ చంద్ర గార్గ్ గురువారం స్పష్టం చేశారు. నీరవ్ మోదీ, మెహుల్ చౌక్సీలు తప్పుడు పిఎన్‌బికి చెందిన ‘‘లెటర్స్ ఆఫ్ అండర్ టేకింగ్’’ (ఎల్‌ఓయు)లను చూపి, విదేశాల్లోని భారతీయ బ్యాంకులనుంచి పెద్దమొత్తంలో రుణాలు పొందారన్న ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. మొదట పంజాబ్ నేషనల్ బ్యాంకు, 1.77 బిలియన్ యుఎస్ డాలర్ల మేర మోసపోయినట్టు ప్రకటించినా తర్వాత ఈ మొత్తం 204.25 మిలియన్లుగా పేర్కొంది. అన్ని రకాల నిరర్థక ఖాతాలను (ఎన్‌పిఎలను) లేదా తిరిగి చెల్లించని రుణాలను పూర్తిగా తొలగించాలని ఆర్థిక మంత్రిత్వశాఖకు చెందిన, డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫైనాన్సియల్ సర్వీసెస్ బ్యాంకులను ఆదేశించిదని ఆయన విలేకర్లకు చెప్పారు. రూ.50 కోట్లకు పైబడి తిరిగి చెల్లించని రుణాలపై దృష్టి పెట్టాలని ప్రభుత్వ రంగ బ్యాంకులను ఆర్థిక మంత్రిత్వశాఖ ఆదేశించిందన్నారు. అంతేకాదు అనినీతికి సంబంధించిన అన్ని కేసులను సీబీఐకి నివేదించాలని కూడా బ్యాంకులను కేంద్రం ఆదేశించింది.