బిజినెస్

61 పాయింట్లు తగ్గిన సెన్సెక్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మార్చి 13: సోమవారం ట్రేడింగ్‌లో దూసుకెళ్లిన మార్కెట్లు మంగళవారం తడబడ్డాయి. మొదట లాభాల్లో ప్రారంభమైనా మిడ్ సెషన్ తర్వాత అమ్మకాలు జోరందుకోవడంతో నష్టాల్లో ముగిసాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ 61.16 పాయింట్లు పడిపోగా, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ మాత్రం స్వల్పంగా 5.45 పాయింట్లు స్వల్ప లాభంతో ముగిసింది. ఆసియా మార్కెట్లు బలహీనతల మధ్య, బీఎస్‌ఈ సెన్సెక్స్ 33,818.22 వద్ద ప్రారంభమై, తర్వాత వేగంగా కోలుకొని 34,000 మార్కును దాటి 34077.32ను తాకింది. తర్వాత 61.66 పాయింట్లు పడిపోయి 33,856.78 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 10,426.85 కు ఎగబాకి 5.45 పాయింట్లు స్వల్ప లాభాన్ని నమోదు చేసింది. టాటా సన్స్ టిసిఎస్‌లో వాటాల అమ్మకం ద్వారా రూ.8,200 కోట్లు సమీకరించే ఉద్దేశంతో ఉన్నారన్న వార్తల నేపథ్యంలో టిసిఎస్ భారీగా నష్టపోయింది. ఐటీ రంగానికి చెందిన టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్, ఇన్ఫోసిస్ షేర్లు నష్టాలను చవిచూశాయి. కాగా కోటక్ మహేంద్రా బ్యాంక్, కోల్ ఇండియా, ఎన్‌టిపిసి, మారుతి సుజ్‌కీ, ఎల్‌అండ్‌టి, ఎం అండ్ ఎం, హెచ్‌యుఎల్, ఐటిసి, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు, ఆదాని పోర్ట్స్, ఇండస్‌ల్యాండ్ బ్యాంక్, ఓఎన్‌జీసీ, పవర్‌గ్రిడ్‌లు నష్టపోయాయి. గీతాంజలి జెమ్స్ తీవ్రస్థాయి అమ్మకపు ఒత్తిళ్లను ఎదుర్కొని రూ.14.30కు పడిపోయింది. కుంభకోణానికి సంబంధించిన మొత్తాలపై సెటిల్‌మెంట్ కుదురుతుందన్న ఆశాభావంతో పీఎన్‌బీ షేర్లు 3.59 శాతం పెరిగి రూ.98కి చేరుకున్నాయి. ఇక యాక్సిస్ బ్యాంక్, సన్ ఫార్మా, భారతీ ఎయిర్‌టెల్, విప్రో, డాక్టర్ రెడ్డీస్, ఐసీఐసీఐ బ్యాంకు, టాటా స్టీల్, ఎస్‌బీ, హీరో మోటార్స్, ఆసియన్ పెయింట్స్, ఆర్‌ఐల షేర్లు సానుకూల స్థితిలో ముగిసాయి.