బిజినెస్

ఊపందుకున్న డిజిటల్ చెల్లింపులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 13: నోట్ల రద్దు, నగదు రహిత లావాదేవీల వల్ల దేశంలో డిజిటల్ చెల్లింపులు మరింత ఊపందుకున్నాయి. ఇదే పోకడ కొనసాగితే 2025 నాటికి దేశంలో వార్షిక డిజిటల్ లావాదేవీలు ఒక ట్రిలియన్ డాలర్ల స్థాయికి చేరగలవని ఒక నివేదిక అంచనా వేసింది. ఎసిఐ వరల్డ్‌వైడ్, ఎజిఎస్ ట్రాన్సాక్ట్ టెక్నాలజీలు సంయుక్తంగా రూపొందించిన ఈనివేదిక ప్రకారం 2025 నాటికి ప్రతి 5 లావాదేవీల్లో 4 డిజిటల్‌కు సంబంధించినవే ఉంటా యి. ప్రస్తుతం దేశంలో వినియోగ ఆధారంగా డిజిటల్ లావాదేవీలు 90 మిలియన్ల వరకు ఉండగా, కొత్తగా గ్రామీణ, పట్టణ ప్రాంత వినియోగదార్లు కూడా డిజిటల్ బాట పట్టడం వల్ల 2020 నాటికి ఈ లావాదేవీలు 300 మిలియన్లకు చేరుకోనున్నాయి. ఈ మార్కెట్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో విశ్వనీయమైన సాంకేతిక పరిజ్ఞానం అవసరమని నివేదిక పేర్కొంది.
ఒకపక్క దేశంలో పెరిగే డిజిటల్ లావాదేవీలకు సైబర్ ముప్పుకూడా పొంచి ఉన్న నేపథ్యంలో, ఆయా కంపెనీలు సైబర్ భద్రతపై దృష్టి కేంద్రీకరించక తప్పదు. నిజానికి దేశవ్యాప్తంగా అంతర్జాల వినియోగం బాగా విస్తరించడం, డిజిటల్ లావాదేవీలు పెరగడానికి దోహదం చేసింది. అయితే మిగిలిన పాశ్చాత్య దేశాల మార్కెట్‌ల స్థాయి పరిణితికి భారత మార్కెట్ చేరుకోకపోవడానికి ప్రధాన కారణం పూర్తి అవగాహన ఏర్పడకపోవడమే నని ఎఎస్‌జి ట్రాన్సాక్ట్ టెక్నాలజీస్ అధికారి మహేష్ పటేల్ పేర్కొన్నారు. ప్రస్తుతం సైబర్ దాడులను నిరోధించేందుకు భారత్ వార్షికంగా 4 బిలియన్ యుఎస్ డాలర్లు ఖర్చు చేస్తోంది. అయితే ఇది 2025 నాటికి 20 బిలియన్ డాలర్లకు చేరే అవకాశముంది. ఈ నేపథ్యంలో డిజిటల్ లావాదేవీలు అవిభాజ్యరీతిలో ప్రగతిని ప్రోత్సహించే రీతిలో ఉండటమే కాకుండా, సైబర్ సెక్యూరిటీ, అవినీతిలను నిరోధించే స్థాయిలో కొనసాగాల్సి ఉందని మహేష్ పటేల్ అన్నారు. పెద్ద ఎత్తున ఈ-చెల్లింపులు పెంచడంతోపాటు, సైబర్ భద్రతకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా భారత్ ప్రపంచంలో లీడింగ్ స్థాయికి చేరుకోగలదని నివేదిక పేర్కొంది. మరింత ఆర్థిక సమ్మిళితత్వానికి, యుపిఐ లావాదేవీలు కీలకమని వివరించింది. దేశంలో స్మార్ట్ ఫోన్ల వినియోగదార్లు 2020 నాటికి 500 మిలియన్లకు చేరుకుంటారని ‘‘టాన్‌సాక్షన్స్-2025’’ పేరుతో విడుదల చేసిన శే్వతపత్రం పేర్కొన్నది. ఈ నేపథ్యంలో అవినీతిని నిరోధించే రీతిలో డిజిటల్ లావాదేవీలు కొనసాగాలని ఎసిఐ వరల్డ్‌వైడ్ సంస్థ పేర్కొంది.