బిజినెస్

దేశంలో పడిపోయిన వజ్రాల మార్కెట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మార్చి 16 : నీరవ్ మోదీ ప్రభావంతో దేశీయ వజ్రాల మార్కెట్ విశ్వసనీయత బాగా దెబ్బతిన్నది. ఫలితంగా గత రెండు నెలల కాలంలో ఈ మార్కెట్ 10-15 శాతం వరకు పడిపోయిందని ఒక సర్వే తేల్చింది. ముఖ్యంగా కొనుగోలుదార్లు, వజ్రాల నాణ్యతపై అనుమానం వ్యక్తం చేస్తూ కొనుగోళ్లకు ముందుకు రాకపోవడంతో డైమండ్ మార్కెట్ పడిపోయినట్టు ఒక సర్వే పేర్కొన్నది. బ్రాండెడ్ వజ్రాల తయారీదార్లు స్వచ్ఛతపై సర్ట్ఫికెట్లు ఇస్తున్నప్పటికీ, దేశంలో అసంఘటిత మార్కెట్‌లోనే వజ్రాల వాణిజ్యం ప్రధానంగా కేంద్రీకృతమైంది. ఈ మార్కెట్ పూర్తిగా వినియోగదార్లు, ఆభరణ వ్యాపారుల మధ్య పరస్పర విశ్వాసం ఆధారంగానే కొనసాగుతుందని, సర్వే నిర్వహించిన అసోచామ్ స్పష్టం చేసింది. ‘‘ప్రస్తుతం ఈ మార్కెట్‌పై తీవ్ర ప్రతికూల ప్రచారం జరిగిన నేపథ్యంలో, వినియోగదారులెవ్వరూ కొనుగోళ్లకు ముందుకు రావడంలేదు. బ్రాండెడ్ సంస్థలు స్వచ్ఛతపై సర్ట్ఫికెట్లు ఇస్తున్నా, అవి కేవలం పెద్ద నగరాలకే పరిమితం. చిన్న నగరాల్లో కొనుగోలు శక్తి ఉన్నప్పటికీ అటువంటి సంస్థలు అందుబాటులో లేవు,’’ అని సర్వే వివరించింది.
ఢిల్లీ-ఎన్‌సీఆర్, ముంబయి, అహమ్మదాబాద్, బెంగళూరు, ఛండీగఢ్, డెహ్రాడూన్ నగరాల్లోని మొత్తం 350 వజ్రాల వ్యాపారులను ఈ సంస్థ సర్వే చేసింది. ఇదే నగరాల్లో 500 మంది ఉద్యోగినులు, గృహిణుల అభిప్రాయాలను కూడా సంస్థ తీసుకున్నది. ఈ సర్వే ప్రధానంగా 65 శాతం వరకు అసంఘటిత వజ్రాల వ్యాపారులపైనే దృష్టి కేంద్రీకరించింది. వజ్రాల స్వచ్ఛతపై నమ్మకం కోల్పోయిన వినియోగదార్లు, ప్రస్తుతం బంగారం, వెండి ఆభరణాలవైపుకు మళ్లుతున్నారని వ్యాపారులు తెలిపారు. ఇదే సమయంలో తాము గతంలో కొనుగోలు చేసిన వజ్రాభరణాల స్వచ్ఛతను మరోసారి ధ్రువీకరించుకోవడానికి వినియోగదారులు యత్నిస్తున్నారని కూడా సర్వేలో వెల్లడైంది.