బిజినెస్

మూడో వారమూ నష్టాలే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మార్చి 17: దేశీయ స్టాక్ మార్కెట్‌లో వరుసగా మూడో వారం బేర్ ఆధిక్యమే కొనసాగింది. శుక్రవారంతో ముగిసిన ఈ వారంలో ముఖ్యంగా వాణిజ్య యుద్ధ భయం పెరగడంతో భౌగోళిక రాజకీయపరమైన ఆందోళన మదుపరులలో తీవ్రమై కీలక సూచీలు పతనమయ్యాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్ ఈ వారంలో మరో 131.14 పాయింట్లు పడిపోయి 33,176 పాయింట్ల వద్ద ముగిసింది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) నిఫ్టీ కీలకమైన 10,200 పాయింట్ల స్థాయికన్నా దిగువకు పడిపోయింది. ఈ వారంలో 31.70 పాయింట్లు దిగజారిన ఈ సూచీ 10,195.15 పాయింట్ల వద్ద స్థిరపడింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా, భారత్‌లను దృష్టిలో పెట్టుకొని కొన్ని దిగుమతులపై సుంకాలను పెంచాలని తీసుకున్న నిర్ణయం వల్ల ప్రపంచ వాణిజ్య యుద్ధం సంభవిస్తుందేమోనన్న భయాలు మదుపరులలో నెలకొనడం ఈ వారంలో దేశీయ స్టాక్ మార్కెట్‌ను కీలకంగా ప్రభావితం చేసింది. వాణిజ్య యుద్ధం తలెత్తే ప్రమాదం తప్పిపోయిందని భావించిన మదుపరులు ఉత్సాహంగా కొనుగోళ్లకు పూనుకోవడంతో ఈ వారం దేశీయ స్టాక్ మార్కెట్ సానుకూలంగానే ప్రారంభమయింది. అమెరికా ఆర్థిక వ్యవస్థ పటిష్ఠంగా ఉన్నట్టు వచ్చిన సంకేతాలు కూడా దీనికి దోహదపడ్డాయి. అయితే, తరువాత పరిస్థితి పూర్తి భిన్నంగా మారిపోయింది. చిల్లర, టోకు ధరల ద్రవ్యోల్బణం, పారిశ్రామికోత్పత్తి (ఐఐపీ) గణాంకాలు సానుకూలంగా ఉండటంతో పాటు, 2018-19 ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు 7.3 శాతం నమోదవుతుందని ప్రపంచ బ్యాంకు అంచనా వేసినప్పటికీ, ట్రంప్ చేసిన ప్రకటనలు, తీసుకున్న చర్యలు వాణిజ్య యుద్ధ భయాలను తీవ్రం చేయడంతో దేశీయ స్టాక్ మార్కెట్ కుదేలయింది. ఉక్కు, అల్యూమినియం దిగుమతులపై అమెరికా దిగుమతి సుంకాలను విధించడంతో పాటు, చైనానుంచి దిగుమతి అయ్యే సరుకులపై భారీగా పన్నులు విధించడానికి కసరత్తు చేయడంతో పాటు భారత్ ఎగుమతులకు ఇస్తున్న సబ్సిడీలను ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ)లో అమెరికా సవాలు చేయడం వంటి పరిణామాల వల్ల మదుపరులలో ఆందోళన నెలకొని దేశీయ స్టాక్ మార్కెట్‌లో ప్రతికూల ప్రభావం చూపింది. దేశీయంగా చూస్తే, బ్యాంకులు లెటర్స్ ఆఫ్ అండర్‌టేకింగ్ (ఎల్‌ఓయూలు) జారీ చేయకుండా రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) నిషేధం విధించడం వల్ల బ్యాంకింగ్, ఆర్థిక సంస్థల షేర్లు తీవ్రమయిన అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. అయితే, ఇవి తరువాత పుంజుకున్నాయి. తెలుగుదేశం పార్టీ ఎన్‌డీఏ నుంచి బయటకు రావడంతో పాటు కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టడం వంటి రాజకీయ పరిణామాలు కూడా మార్కెట్‌లో అనిశ్చితిని తీవ్రం చేశాయి.
ఈ వారం 33,468.16 పాయింట్ల వద్ద ప్రారంభమయిన సెనె్సక్స్ 34,077.32- 33,119.92 పాయింట్ల మధ్య కదలాడింది. చివరకు క్రితం వారంతో పోలిస్తే 131.14 పాయింట్ల (0.39 శాతం) నష్టంతో 33,176 పాయింట్ల వద్ద ముగిసింది.
నిఫ్టీ ఈ వారం 10,301.60 పాయింట్ల వద్ద ప్రారంభమయి, 10,478.60- 10,180.25 పాయింట్ల మధ్య కదలాడింది. చివరకు క్రితం వారంతో పోలిస్తే 31.70 పాయింట్ల (0.31 శాతం) నష్టంతో 10,195.15 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ వారంలో ఐటీ, మెటల్, క్యాపిటల్ గూడ్స్, చమురు- సహజ వాయువు, టెక్నాలజి, వాహన, స్థిరాస్తి రంగాల షేర్లు నష్టపోయాయి. కన్స్యూమర్ డ్యూరేబుల్స్, ఐపీఓలు, బ్యాంకులు, ఆరోగ్య సంరక్షణ, ఎఫ్‌ఎంసీజీ, ప్రభుత్వ రంగ సంస్థలు, విద్యుత్తు రంగాల షేర్ల ధరలు పుంజుకున్నాయి.