బిజినెస్

రానిబాకీల పాపం వాటిదే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 17: బ్యాంకింగ్ రంగం మోస్తున్న రానిబాకీల పాపం పెద్ద కంపెనీలదే. కొన్ని బ్యాంకులు పెద్ద కంపెనీలకు ఇచ్చిన రుణాలలో 40 శాతానికి పైగా రుణాలను నిరర్ధక ఆస్థులు (ఎన్‌పీఏలు) లేదా రానిబాకీలుగా ప్రకటించాయి. బ్యాంకులు బూమ్ కాలంలో విచక్షణారహితంగా రుణాలు ఇవ్వడంతో పాటు వసూలు కాని రుణాలను గుర్తించాలని రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) చేసిన ఒత్తిడి వల్ల కొన్ని బ్యాంకులు పెద్ద కంపెనీలకు ఇచ్చిన రుణాలలో 40 శాతానికి పైగా రుణాలను నిరర్ధక ఆస్తుల జాబితాలో చేర్చాయి. 2017 డిసెంబర్ చివరి నాటికి దేశంలోని అయిదు బ్యాంకులు పెద్ద పరిశ్రమలకు ఇచ్చిన రుణాలలో 40 శాతానికి పైగా నిరర్ధక ఆస్తులేనని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పార్లమెంటుకు తెలిపింది. ప్రైవేటు రంగ బ్యాంకు క్యాధలిక్ సిరియన్ బ్యాంక్ వీటిలో అగ్ర స్థానంలో ఉంది. ఈ బ్యాంకు పెద్ద కంపెనీలకు ఇచ్చిన రుణాలలో 50 శాతానికి పైగా రుణాలు పాడు రుణాల జాబితాలో చేరిపోయాయి. మరో ఆరు బ్యాంకులు పెద్ద కంపెనీలకు ఇచ్చిన రుణాలలో 30 శాతానికి పైగా రుణాలు నిరర్ధక ఆస్తుల జాబితాలో చేరిపోయాయి. ఉక్కు, వాహన విడిభాగాలు, స్థిరాస్తి తదితర రంగాలకు చెందిన కనీసం డజను కంపెనీలు తీసుకున్న రుణాలను చెల్లించడంలో మళ్లీ మళ్లీ విఫలమయినందుకు దివాలా తీసిన కంపెనీలుగా చర్యను ఎదుర్కొంటున్నాయి. కొన్ని కన్స్యూమర్ గూడ్స్ కంపెనీలు సహా మరో 40 పెద్ద కంపెనీలను రుణదాతలు దివాలా ప్రక్రియ న్యాయస్థానం (ఇన్‌సాల్వెన్సీ కోర్టు)లోకి లాగారు. పెద్ద సంఖ్యలో విద్యుత్ కంపెనీల భవిష్యత్తు అనిశ్చితిలో పడింది. రుణాలు ఇచ్చిన బ్యాంకులు త్వరలోనే వాటికి వ్యతిరేకంగా చర్యలు తీసుకుంటాయని అంచనా.