బిజినెస్

ఎన్‌డీటీవీకి రూ. పది లక్షల జరిమానా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: సుమారు రూ. 450 కోట్ల ఆదాయపు పన్ను డిమాండ్‌కు సంబంధించిన వివరాలను వెల్లడించడంలో ఆలస్యం చేసినందుకు మీడియా సంస్థ ఎన్‌డీటీవీపై క్యాపిటల్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ రూ. పది లక్షల జరిమానా విధించింది.
అలాగే, ఎన్‌డీటీవీ డైరెక్టర్లు ప్రణయ్ రాయ్, రాధికా రాయ్ సహా నలుగురు వ్యక్తులపై రూ. మూడు లక్షల చొప్పున జరిమానా విధించింది. ఎన్‌డీటీవీ సంస్థ ఉన్నత స్థాయి ఎగ్జిక్యూటివ్ ఒకరు నాలుగేళ్ల క్రితం విక్రయించిన షేర్ల వివరాలను సకాలంలో వెల్లడించకపోవడాన్ని సెబీ తప్పుబట్టింది. సెబీ అభియోగాలను ఎన్‌డీటీవీ సవాలు చేయడం, వివిధ దర్యాప్తు సంస్థలు దీనిపై దర్యాప్తు జరపడం వంటివి చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో సెబీ ఈ నెల 16న జారీ చేసిన ఆదేశాలలో ఎన్‌డీటీవీపై జరిమానా విధించింది. ఎన్‌డీటీవీ గ్రూపు అప్పటి సీఈఓ విక్రమాదిత్య చంద్ర, కాంప్లియెన్స్ అధికారి అనూప్ సింగ్ జునేజాలకు కూడా రూ. మూడు లక్షల చొప్పున సెబీ జరిమానా విధించింది. ఎన్‌డీటీవీ అప్పటి ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ కేవీఎల్ నారాయణ్ రావుకు కూడా నోటీసులు పంపించినట్టు సెబీ వెల్లడించింది.
అయితే, నిరుడు చివరలో ఆయన చనిపోవడం వల్ల ఆయనకు వ్యతిరేకంగా విచారణ ప్రక్రియను నిలిపివేసినట్టు వివరించింది.