బిజినెస్

కియా.. బహుత్ షుక్రియా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌ను రెండో స్వగృహంగా దక్షిణ కొరియా భావించాలని, రాష్ట్భ్రావృద్ధికి ఇతోధికంగా తోడ్పడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేశారు. సోమవారం ఏపీలో కొరియాకు చెందిన 16 ఆటోమొబైల్ అనుబంధ పరిశ్రమల క్లస్టర్ ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కియా అనుబంధ సంస్థలైన ‘హ్యుండై మొబిస్’తో ప్రాథమిక అవగాహన ఒప్పందం సోమవారం కుదుర్చుకుంది. ప్రాథమిక అవగాహన ఒప్పందం పత్రంపై రాష్ట్ర పరిశ్రమల శాఖ కార్యదర్శి సాల్మన్ అరోకియా రాజ్, ముఖ్యమంత్రి చంద్రబాబు, పరిశ్రమల మంత్రి అమరనాథరెడ్డి సమక్షంలో సంతకం చేశారు. ఈసందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ తమ విధానాలతో నిబద్ధతతో కూడిన పెట్టుబడిదారులు వచ్చి రూ. 24,600 కోట్లు పెట్టుబడులు పెట్టారన్నారు. అనంతపురం నుంచి నెల్లూరు వరకు చిత్తూరు మీదుగా ఆటో కారిడార్‌గా తయారవుతుందన్నారు. రూ. 4,790 కోట్ల పెట్టుబడులతో కొరియన్ కంపెనీలు 6,583 మందికి ఉపాధి అవకాశాలు కల్పించనున్నాయని ముఖ్యమంత్రి తెలిపారు. అనంతపురం జిల్లా ఎర్రమంచి దగ్గర తాము దక్షిణ కొరియా క్లస్టర్‌కు 534, గుడిపల్లిలో 71, అమ్మవారిపల్లి గ్రామం దగ్గర 131 ఎకరాలు కేటాయించామని ముఖ్యమంత్రి వివరించారు. తాను గత నెలలోనే కియా మోటార్స్ ఫ్రేమ్‌వర్క్ వ్యవస్థాపక కార్యక్రమంలో పాల్గొన్నానని, ఇప్పుడు ప్రాజెక్టు ప్రాంగణంలో పురోగతిని చూశాక చాలా సంతోషంగా ఉందని చెప్పారు. ఆటోమొబైల్ అనుబంధ సంస్థలతో కలిసి ఏర్పాటు చేస్తున్న ఈ క్లస్టర్ భారత్‌లోనే అతిపెద్ద ఎఫ్‌డీఐగా అభివర్ణించారు. అనంతపురం జిల్లాకు, తద్వారా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఈ ప్రాజెక్టులు బాటవేస్తున్నాయన్నారు. భవిష్యత్‌లో మరిన్ని కొరియన్ కంపెనీలు ఆంద్రప్రదేశ్‌కు వస్తాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఆటోమొబైల్ రంగ అభివృద్ధి వాతావరణం ఏర్పడుతోందని, ఎంఎస్‌ఎంఈ యూనిట్లు పెరుగుతాయని, ఆంధ్రప్రదేశ్‌కు సకారాత్మక బ్రాండ్ ఇమేజీ వస్తుందని అన్నారు. తాము మూడేళ్ల క్రితం దేశంలో అత్యుత్తమమైన ఆటోమొబైల్ విధానాన్ని తీసుకొచ్చామన్నారు. కియా మోటార్స్‌కు ఆంధ్రప్రదేశ్‌లో ఎలాంటి సమస్యలూ ఉత్పన్నం కావని, తాము నిబద్ధతతో ఉన్నామని, ముందుగానే అన్ని వౌలిక సదుపాయాలు సమకూర్చామన్నారు. ఈ ప్రాంతం ఒక ఆటోమొబైల్ క్లస్టర్‌గా అభివృద్ధి కావాలన్నది తమ అభిమతమని చెప్పారు. మూడున్నరేళ్లలో 3.7 బిలియన్ డాలర్ల విలువైన ఆటోమొబైల్ కంపెనీలను తమ రాష్ట్రానికి తీసుకొచ్చామన్నారు. దక్షిణ కొరియాకు, ఆంధ్రప్రదేశ్‌కు జనాభా రీత్యా, భౌగోళిక పరిస్థితుల రీత్యా సారూప్యత, సాపత్యం ఉన్నాయని గుర్తుచేశారు. ‘ఏ సమయంలో ఎటువంటి సమస్య వచ్చినా వెనువెంటనే పరిష్కరించడానికి నేను సిద్ధం’ అని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు. ఈ నెల ముగిసేలోగానే తొలి కారును విడుదల చేయాలని, ఏటా 3లక్షల వాహనాలను ఉత్పత్తి చేయాలని చంద్రబాబు ఆకాంక్షించారు.

చిత్రం..సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పంద పత్రాలు మార్చుకుంటున్న ‘హ్యుండై మొబిస్’ప్రతినిధులు