బిజినెస్

అన్ని రంగాలకూ నిశ్చితకాల ఉద్యోగాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 20: కొన్ని ప్రత్యేక ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు శ్రామికులను నిర్ణీత కాలానికి ఉద్యోగంలోకి తీసుకునే సదుపాయాన్ని కేంద్ర ప్రభుత్వం అన్ని రంగాలకు పొడిగించింది. ఇప్పటి వరకు ఈ సదుపాయం ఇండస్ట్రియల్ ఎస్టాబ్లిష్‌మెంట్ (స్టాండింగ్ ఆర్డర్) 1946 ప్రకారం కేవలం అపెరల్ రంగానికి మాత్రమే వర్తింపజేస్తున్నారు. ఈ మేరకు కార్మిక మంత్రిత్వశాఖ జారీ చేసిన నోటీసు ప్రకారం, ‘‘అపెరల్ తయారీ రంగంలో నిశ్చిత కాల ఉపాధి’’ అనే వాక్యం స్థానంలో ‘‘నిశ్చితకాల ఉపా ధి’’ అని చేర్చారు. దీనివల్ల ఈ సదుపాయం అన్ని రంగాలకు వర్తిస్తుందని అరుణ్ జైట్లీ బడ్జెట్ ప్రసంగం సందర్భంగా పేర్కొన్నారు. ఉద్యోగ కాలం, సర్వీసుకు సంబంధించిన ఇతర నిబంధనలు, వివిధ చట్టాల కింద రెగ్యులర్ ఉద్యోగులకు ఇచ్చే పారితోషికాల వంటివి ఈ నిర్వచనంలో పేర్కొన్నారు. కాంట్రాక్టు వర్కర్ కంటే, స్వల్పకాలికంగా నియమితుడయ్యే శ్రామికులకు మరింత ఉత్తమ మరియు సర్వీసు నిబంధనలు వర్తింపజేస్తారు. కొత్త ఆదేశాల ప్రకారం తాత్కాలిక ఉద్యోగిని తొలగించేందుకు ముందుగా నోటీసు జారీ చేయాల్సిన అవసరం లేదు. అం దువల్ల నిశ్చితకాలం పనిచేసే శ్రామికుడు, తన కాంట్రాక్టు రెనివల్ కానిపక్షంలో కాలావధి ముగిసిన వెంటనే తన ఉద్యోగాన్ని కోల్పోతాడు. చట్టంలోని సవరణ ప్రకారం తాత్కాలిక ఉద్యోగి మూడు నెలలు వరుసగా సర్వీసులో ఉన్నట్లయితే, రెండు వారాల మందు నోటీసు ద్వారా అతనిని తొలగించవచ్చు. ఒకవేళ అతను మూడు నెలల కాలాన్ని పూర్తిచేయనట్లయితే, అతడిని తొలగించడానికి గల కారణాలను రెండు వారాల ముందు లిఖితపూర్వకంగా అతనికి తెలియజేయాలి.