బిజినెస్

ఆర్‌బిఐ ద్రవ్యసమీక్షపై ఆధారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 29: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) ద్రవ్యసమీక్ష, జూలై-సెప్టెంబర్ త్రైమాసిక జిడిపి గణాంకాలు ఈ వారం మార్కెట్ సరళిని శాసిస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. అలాగే ఈ పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి)కు సంబంధించిన పరిణామాలూ కీలకమేనని స్పష్టం చేస్తున్నారు. ఈ మూడు అంశాలు ఈ వారం మార్కెట్ సెంటిమెంట్‌ను ప్రభావితం చేస్తాయని పేర్కొంటున్నారు. కాగా, జూలై-సెప్టెంబర్ త్రైమాసికానికిగాను జిడిపి గణాంకాలను కేంద్ర ప్రభుత్వం సోమవారం విడుదల చేస్తుండగా, మంగళవారం ఆర్‌బిఐ ద్రవ్యసమీక్ష జరపనుంది. అలాగే ఇదే రోజున దేశీయ ఆటో అమ్మకాల వివరాలను ఆటోరంగ సంస్థలు ప్రకటించనున్నాయి. ఈ క్రమంలో మదుపరులు తమ పెట్టుబడులపై వీటి ఆధారంగానే నిర్ణయం తీసుకుంటారని నిపుణులు విశే్లషిస్తున్నారు.
ఇకపోతే డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ, అంతర్జాతీయ స్టాక్ మార్కెట్ల కదలికలు, గ్లోబల్ మార్కెట్‌లో ముడి చమురు ధరలు కూడా భారతీయ స్టాక్ మార్కెట్ల తీరుతెన్నులను ఎప్పటిలాగే ప్రభావితం చేస్తాయని క్యాపిటల్‌వయా గ్లోబల్ రిసెర్చ్ వ్యవస్థాపక సిఇఒ రోహిత్ గడియా అన్నారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో జిఎస్‌టి బిల్లు పరిణామాలనూ మదుపరులు దగ్గరగా గమనిస్తారని పేర్కొన్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి జిఎస్‌టిని అమల్లోకి తీసుకురావాలని కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉన్నది తెలిసిందే. ఈ క్రమంలో జిఎస్‌టి బిల్లు పాసవడానికి లోక్‌సభలో తగిన మెజారిటీ ఉన్నా.. రాజ్యసభలో బిజెపి సర్కారుకు మెజారిటీ లేకపోవడం సమస్యగా మారింది. ఈ దృష్ట్యానే శుక్రవారం కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌తో మోదీ చర్చలు జరపడం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇది మార్కెట్ సెంటిమెంట్‌నూ పెంచగా, ఈ శీతాకాల సమావేశాల్లోనే జిఎస్‌టి బిల్లు పాసవుతుందన్న విశ్వాసం మదుపరులలో పెరిగిందని రోహిత్ గడియా చెబుతున్నారు. కాగా, ఆర్‌బిఐ ద్రవ్యసమీక్షతోపాటు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ద్రవ్యసమీక్షపైనా మదుపరులు దృష్టి సారించారని జియోజిత్ బిఎన్‌పి పరిబాస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఫండమెంటల్ రిసెర్చ్ అధిపతి వినోద్ నాయర్ అన్నారు.
గత రెండు వారాలుగా దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో నడుస్తున్నది తెలిసిందే. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ ఈ రెండు వారాల్లో 517.67 పాయింట్లు పుంజుకోగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 180.45 పాయింట్లు లాభపడింది.