బిజినెస్

భారత్‌లో హెచ్‌సీఈఎం కార్యకలాపాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 21: హెల్త్‌కేర్ రంగంలో అధునాతన శస్తచ్రికిత్స పరికరాలను అందిస్తున్న హెల్త్‌కేర్ ఎక్విప్‌మెంట్ అండ్ మెడికల్ (హెచ్‌సీఈఎం) సంస్థ భారత్‌లో తన కార్యకలాపాలను ప్రారంభించింది. బుధవారం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో బ్రిటీష్ డిప్యూటీ హైకమిషనర్ యాండ్రూ ఫ్లెమింగ్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. అనంతరం సంస్థ ఇండియా ప్రతినిధి వికాస్ ఖన్నాతో కలిసి ఆయన మాట్లాడారు. 50కి పైగా దేశాలకు హెల్త్‌కేర్ ఉత్పత్తులను అందిస్తున్న తమ సంస్థ వేగంగా అభివృద్ధి చెందుతున్న భారతదేశంలోకి ప్రవేశించడం ఆనందంగా ఉందని అన్నారు. గ్లోబల్ మెడికల్ హబ్‌గా హైదరాబాద్ మారుతున్న నేపథ్యంలో ఇక్కడ ప్రధాన కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఇక్కడి నుంచి దేశవ్యాప్తంగా తమ కార్యకలాపాలను నిర్వహిస్తామని వివరించారు.