బిజినెస్

పుంజుకోనున్న ప్రభుత్వ రంగ బ్యాంకులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 21: దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంకులు 2019-20 ఆర్థిక సంవత్సరంలో తిరిగి పుంజుకునే అవకాశమున్నదని ఎస్ అండ్ పీ గ్లోబల్ రేటింగ్ సంస్థ వెల్లడించింది. ముఖ్యంగా అంతర్గత నియంత్రణ వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి గట్టి చర్యలు తీసుకుంటుండటం వల్ల ఇది సాధ్యమని పేర్కొంది. ఇటీవల చోటు చేసుకున్న రూ.13000 కోట్ల కుంభకోణం, దేశీయ బ్యాంకింగ్ వ్యవస్థలో చోటుచేసుకున్న పాలనాపరమైన మరియు పారదర్శక ప్రమాణాల్లో నెలకొన్న బలహీనతలను బయటపెట్టింది. 34విల్ ది గ్లోబల్ ఎకనామిక్ రికవరీ లిఫ్ట్ బ్యాంక్స్ ఇన్ మేజర్ ఎమర్జింగ్ మార్కెట్స్2 పేరుతో ఎస్ అండ్ పి గ్లోబల్ రేటింగ్ సంస్థ నివేదికను విడుదల చేసింది. బ్యాంకుల ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ పదవులను ప్రభుత్వం వేరు చేసింది. అయితే బ్యాంకుల్లో సంస్కరణలకోసం మరిన్ని చర్యలు చేపట్టాల్సి ఉన్నదని పేర్కొంది. ఇదే సమయంలో బ్యాంకుల అంతర్గత నియంత్రణ వ్యవస్థలను బలోపేతం చేయాల్సి వున్నదని కూడా వివరించింది. 3 రికవరీ రేట్లను మరింత బలోపేతం చేసేందుకు లీగల్ ఫ్రేమ్‌వర్క్‌ను మరింత బలోపేతం చేస్తారని ఆశిస్తున్నాం. వసూలుకాని రుణాలను వదిలించుకొని, కొత్త బ్యాలన్స్ షీట్లను వచ్చే ఏడాది రూపొందిస్తాయి. అందువల్ల బ్యాంకుల నివేదికల్లో మరో ఏడాది నష్టం నమోదవుతుంది2 అని నివేదిక పేర్కొం ది. కేంద్ర ప్రభు త్వం బ్యాంకులకు మూలధన సదుపాయ ప్రతిపాదన కారణంగా, ప్రభుత్వ రంగ బ్యాంకులకు ఎగవేసిన రుణాలవల్ల కలిగిన నష్టాలనుంచి కొంత ఊపిరిపీల్చుకునే అవకాశం లభిస్తుంది. ఈ నేపథ్యంలో 2020 నాటికి బ్యాంకులు తిరిగి కోలుకోవచ్చునని నివేదిక అంచనా వేసింది. ప్రభుత్వ రంగ బ్యాంకులు మొత్తం 13-15 శాతం వరకు మొండిబాకీలతో సతమతమవుతుండగా, 2017 సెప్టెంబర్ నాటికి నిరర్ధక ఆస్తులు 10.2 శాతంగా నమోదయ్యాయి.
సరిగ్గా వసూలు కాని రుణాల్లో, చెడ్డ రుణాలను కొద్ది వారాల్లోగా భారతీయ బ్యాంకులు గుర్తిస్తాయన్న విశ్వాసాన్ని నివేదిక వ్యక్తం చేసింది. కొత్తగా అమల్లోకి వచ్చిన దివాలా చట్టం వల్ల 2018 ఆర్థిక సంవత్సరంలో నిరర్థక ఆస్తులపై తీర్మానం రూపొందించే ప్రక్రియ వేగవంతం కాగలదని పేర్కొంది. 2019 నాటికి దేశ స్థూల జాతీయోత్పత్తి (జిడిపి) 7.6 శాతంగా, 2020 నాటికి 7.8 శాతంగా ఉండగలదని అంచనా వేసింది. నోట్ల రద్దు, జీఎస్టీల అమలు వల్ల కలిగిన ప్రతికూల పరిణామాలు క్రమంగా తగ్గుముఖం పట్టడం, అంతర్జాతీయ వాణిజ్యం కోలుకుంటున్న నేపథ్యంలో దేశ వాణిజ్యం , జిడిపి ప్రగతి మరింత వేగం పుంజుకోగలదని పేర్కొంది.