బిజినెస్

పరిశోధన, అభివృద్ధికి ఊతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 22: పట్టు (సిల్కు) రంగంలో పరిశోధన, అభివృద్ధి (ఆర్‌అండ్‌డీ)కి, సాంకేతిక పరిజ్ఞాన బదలాయింపునకు మంచి ప్రోత్సాహమివ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని కేంద్ర వస్తప్రరిశ్రమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ గురువారం తెలిపారు. ఇందుకోసం రూ.1000 కోట్ల నిధితో మొట్టమొదటిసారి ఇంటర్ మినిస్టీరియల్ ప్యానల్‌ను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. పట్టు రంగంలో భారత్ స్వయం సమృద్ధి సాధించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు. ఈ ప్యానల్‌లో సంబంధిత మంత్రిత్వశాఖలకు చెందిన ప్రతినిధులు ఉంటారు. ఈ ప్యానల్ టెక్స్‌టైల్ మినిస్ట్రీ కింద పనిచేస్తుందన్నారు. ఆర్ అండ్ డి కార్యకలాపాల విస్తరణకు మొత్తం రూ.1000 కోట్లు ఈ ప్యానల్ పంపిణీ చేస్తుందన్నారు. 2020 నాటికి పట్టు ఉత్పత్తిలో భారత్ స్వయం సమృద్ధి సాధించాలన్న లక్ష్యంతో ముందుకెళుతున్నామన్నారు. ‘‘కేవలం సాంకేతిక పరిజ్ఞాన బదలాయింపుకోసం 50 వేలమందికి శిక్షణ ఇస్తామన్నారు. ఆర్ అండ్ డి కేవలం వస్త్ర పరిశ్రమకే పరిమితం కారాదన్నారు. ఈ పథకం కింద వ్యక్తిగతంగా యూనిట్లు నెలకొల్పేవారికి అధిక ప్రాధాన్యతనిస్తామన్నారు. యూనిట్ల స్థాపనకు అవసరమైన వౌలిక సదుపాయాల కల్పనలో 50 శాతం ఖర్చును కేంద్రం భరిస్తుందన్నారు. అదే లబ్దిదారుడు ఎస్సీ/ఎస్టీ వర్గానికి చెందినవారైతే 65 శాతం వరకు ఖర్చును కేంద్రం భరిస్తుందని స్పష్టం చేశారు. ఈశాన్య రాష్ట్రాలు, జమ్ము-కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్ వంటి రాష్ట్రాల్లో కేంద్రం 80 శాతం వరకు ఖర్చు చేస్తుదని తెలిపారు. కాగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు 10 శాతం భరించాల్సి ఉంటుందన్నారు. దేశంలోని 27 రాష్ట్రాలు సిల్క్ ఉత్పత్తులను వినియోగిస్తుండగా, కేవలం 17 రాష్ట్రాల్లో మాత్రమే ప్రత్యేక పట్టుశాఖ లేదా డైరెక్టరేట్‌లను కలిగివున్నాయని స్మృతి ఇరానీ వెల్లడించారు. ఇదిలావుండగా ‘ఇంటిగ్రేటెడ్ స్కీం ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ సిల్క్ ఇండస్ట్రీ’ పథకానికి కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదం తెలిపింది.