బిజినెస్

2020 నాటికి 40 బిలియన్ డాలర్ల ఎగుమతులు లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మార్చి 23: వచ్చే 2020 నాటికి భారత్ నుంచి 40 బిలియన్ డాలర్ల మేర ఆక్వా ఉత్పత్తుల ఎగుమతులు లక్ష్యంగా పెట్టుకున్నట్టు సీఫుడ్స్ ఎక్స్‌పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు వీ పద్మనాభన్ చెప్పారు. విశాఖలో శుక్రవారం జరిగిన ఏపీ ఫిష్‌టెక్-2018లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా విలేఖరులతో మాట్లాడుతూ దేశంలో ప్రస్తుతం సాలీనా రూ.40వేల కోట్ల మేర ఆక్వా ఉత్పత్తులు ఇతర దేశాలకు ఎగుమతి చేస్తుండగా, దీనిలో రూ.17 వేల కోట్ల విలువైన ఉత్పత్తులు రాష్ట్రం నుంచి వెళ్తున్నాయన్నారు. వచ్చే 2020 నాటికి రాష్ట్రం నుంచి 4 బిలియన్ డాలర్ల మేర ఆక్వా ఉత్పత్తులు ఎగుమతి చేసేందుకు ఆస్కారం ఉందన్నారు. ఆక్వా ఎగుమతుల విషయంలో రైతులు, ఎగుమతిదారులు కీలక అంశాలను విస్మరించడం వల్ల కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారన్నారు. ముఖ్యంగా రొయ్యల సాగులో నిషేధిత యాంటీ బయాటిక్స్ వాడకం వల్ల విదేశాలు వీటిని నిర్ధ్వందంగా వెనక్కి తిప్పి పంపుతున్నాయన్నారు. ఆక్వా సాగు రైతుల్లో అవగాహన లేమి కారణంగానే ఈ విధమైన పరిస్థితులు ఎదురవుతున్నాయన్నారు. అయితే ఆక్వా రైతుకు నాణ్యమైన రొయ్య పిల్లలను సరఫరా చేయడం ద్వారా యాంటీ బయాటిక్స్ వినియోగాన్ని నియంత్రించే అవకాశం ఉందన్నారు. ఈ విషయంలో ఎంపెడా, సీఐఐ, సీఫుడ్స్ ఎక్స్‌పోర్ట్స్ అసోసియేషన్ సంయుక్తంగా రైతు అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నట్టు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రం లో ఆక్వా సాగుకు సంబంధించి ఇతర దేశాల నుంచి రొయ్య పిల్లలను దిగుమతి చేసుకుంటున్నామని, నాణ్యమైన రొయ్య పిల్లలు ఉత్పత్తి చేసేందుకు అనువుగా విశాఖ జిల్లా నక్కపల్లి వద్ద అత్యాధునిక మల్టిపుల్ కేజ్ సెంటర్ ఏర్పాటుకు ప్రభుత్వం అంగీకరించిందని, రూ.67 కోట్లతో పనులు ప్రారంభించారన్నారు. ప్రస్తుతం ఇటువంటి కేంద్రం తమిళనాడు రాష్ట్రంలో మాత్రమే ఉందన్నారు. సువిశాల తీర ప్రాంతం కలిగిన నవ్యాంధ్రలో ఆక్వా పరిశ్రమ అభివృద్ధి సాధించేందుకు అపార అవకాశాలున్నాయన్నారు. ప్రభుత్వం కూడా ఆ దిశగా చర్యలు తీసుకుంటోందన్నారు. కోల్డ్‌చైన్‌ల ఏర్పాటు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, ఫుడ్ పార్క్ నిర్మాణం వంటి వౌలిక సదుపాయాల కల్పనపై ప్రభు త్వం దృష్టి సారించిందన్నారు.
ఆక్వా చెరువులు, ఆక్వా ప్రాసెసింగ్ యూనిట్ల వల్ల పర్యావరణ సమతౌల్యం దెబ్బతింటోందన్న విమర్శలను పద్మనాభన్ ఖండించారు. పరిశ్రమల ఏర్పాటుతో పర్యావరణ ఇబ్బందికర పరిస్థితులు తలెత్తేమాట వాస్తవమేనని, అయితే అత్యాధునిక యంత్రాలు, పరికరాలతో నీటిని శుద్ధి చేసి తిరిగి వినియోగించుకునేందుకు అవకాశాలున్నాయన్నారు.