బిజినెస్

ద.మ రైల్వే సిబ్బందికి ఐఎస్‌బీ శిక్షణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 23: రైల్వేలో పని చేసే ఉద్యోగులంతా సంస్థాపరమైన నిర్వహణ సామర్ధ్యం పెంచుకోవాలని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ వినోద్‌కుమార్ యాదవ్ అన్నారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత సమర్ధతను పెంచుకోవడం ద్వారా పనితీరును ఎంతో మెరుగుపర్చుకోవచ్చని, తద్వారా సంస్థ నిర్వహణ మరింత బలపడుతుందని అన్నారు. హైదరాబాద్‌లో ఉన్న ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బి)తో దేశంలోనే ప్రధమంగా దక్షిణ మధ్య రైల్వే ఒప్పందం చేసుకుని తమ ఉద్యోగుల్లో పాలనాదక్షణ, నాయకత్వ లక్షణాలు పెంపు, పనితీరు మెరుగుపర్చుకునేందుకు అవసరమైన నిర్వహణ యాజమాన్యం తదితర అంశాల్లో శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించింది. శుక్రవారం నాడిక్కడ మూడు రోజుల పాటు జరిగే వర్క్‌షాప్‌ను ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ ఈ వర్క్‌షాప్ ద్వారా రైల్వే అధికారులు మానవ వనరుల వృద్ధికి కృషి చేయాలని కోరారు. ఐఎస్‌బి డిప్యూటీ డీన్ ప్రొ.మిలింద్ సోహైన్ మాట్లాడుతూ సంస్ధాపరంగా అభివృద్ధి చెందాలంటే పరిశోధన, నిర్వహణ సామర్ధ్యం పెంపు, బహుళ ఆలోచనా శక్తి వంటివి పెంచుకోవడం ద్వారా సాధ్యపడుతుందని అన్నారు. పలువురు రైల్వే అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.