బిజినెస్

152.4 మిలియన్ డాలర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మార్చి 23: వరుసగా రెండు వారాల పాటు పెరిగిన విదేశీ మారకద్రవ్య నిల్వలు మార్చి 16తో ముగిసిన వారంలో 152.4 మిలియన్ డాలర్లు తగ్గి, 421.334 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయని రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) శుక్రవారం వెల్లడించింది. విదేశీ కరెన్సీ ఆస్తులు తగ్గడం వల్లనే విదేశీ మారకద్రవ్య నిల్వలు తగ్గిపోయాయని పేర్కొంది.
అంతకు ముం దు వారంలో భారతదేశ విదేశీ మారకద్రవ్య నిల్వలు 728.9 మిలియన్ డాలర్లు పెరిగి, 421.487 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. విదేశీ మారకద్రవ్య నిల్వలు ఫిబ్రవరి 9న 421.914 బిలియన్ డాలర్లకు చేరుకొని, సరికొత్త జీవనకాల గరిష్ఠ స్థాయిని తాకాయి. 2017 సెప్టెంబర్ 8తో ముగిసిన వారంలో విదేశీ మారకద్రవ్య నిల్వలు మొదటిసారిగా 400 బిలియన్ డాలర్ల మార్కును అధిగమించాయి. అయి తే, అప్పటి నుంచి తగ్గుతూ, పెరుగుతూ వస్తున్నాయి. మార్చి 16తో ముగిసిన వారంలో మొత్తం విదేశీ మారకద్రవ్య నిల్వల్లో ప్రధానమయిన విదేశీ కరెన్సీ ఆస్తులు 175.2 మిలియన్ డాలర్లు తగ్గి, 396. 156 బిలియన్ డాలర్లకు చేరాయి. దేశంలో బంగారం నిల్వలు 13.2 మిలియన్ డాలర్ల మేర పెరిగి, 21.562 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయని ఆర్‌బీఐ తెలిపింది.