బిజినెస్

బేర్‌మన్న స్టాక్ మార్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: చైనా ఉత్పత్తుల దిగుమతులపై సుంకాలను పెంచుతూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనతో ప్రపంచ వాణిజ్య యుద్ధ భయం తీవ్రమయింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు పడిపోయాయి. దీని ప్రభావం దేశీయ స్టాక్ మార్కెట్లపై తీవ్రంగా పడింది. మార్కెట్ కీలక సూచీలు శుక్రవారం భారీగా పడిపోయాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్ ఒక్క సెషన్‌లో 410 పాయింట్లు దిగజారి, అయిదు నెలల కనిష్ట స్థాయి వద్ద ముగిసింది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) నిఫ్టీ కీలకమైన 10,000 పాయిం ట్ల స్థాయికన్నా దిగువకు పడిపోయింది. ఈ సూచీ ఈ సంవత్సరం 10,000 స్థాయికన్నా దిగువకు పతనం కావడం ఇదే మొదటిసారి. సెనె్సక్స్ శుక్రవారం 409.73 పాయింట్లు (1.24 శాతం) పడిపోయి, అయిదు నెలల కనిష్ట స్థాయి అయిన 32,596.54 పాయింట్ల వద్ద ముగిసింది. 2017 అక్టోబర్ 23 తరువాత సెనె్సక్స్ ఇంత దిగువ స్థాయిలో ముగియడం ఇదే తొలిసారి. నిఫ్టీ కూడా శుక్రవారం 116.70 పాయింట్లు (1.15 శాతం) పతనమై మానసికంగా కీలకమైన 10,000 పాయింట్ల మార్కుకన్నా దిగువకు దిగజారి, 9,998.05 పాయింట్ల వద్ద స్థిరపడింది. గత అయిదు నెలల్లో ఈ సూచీ ఇంత దిగువ స్థాయిలో ముగియడం ఇదే మొదటిసారి. 2017 అక్టోబర్ 11న నిఫ్టీ 9,984.80 పాయింట్ల వద్ద ముగిసింది. శుక్రవారం సెషన్‌లో మదుపరులు సుమారు రూ. 1.57 లక్షల కోట్ల మార్కెట్ విలువను కోల్పోయారు. వరుసగా నాలుగో వారం సెనె్సక్స్ 579.46 పాయింట్లు (1.75 శాతం) పడిపోగా, నిఫ్టీ 197.10 పాయింట్లు (1.93 శాతం) దిగజారింది. స్థిరాస్తి, లోహ, బ్యాంకింగ్, క్యాపిటల్ గూడ్స్, ఆరోగ్య సంరక్షణ, పీఎస్‌యూ, వాహన, చమురు- సహజ వాయువు రంగాల షేర్ల విలువ భారీగా పడిపోయింది.
తీవ్రమైన అమ్మకాల ఒత్తిడి వల్ల సెయిల్, జిందాల్ స్టీల్, వేదాంత, హిండాల్కో ఇండ్, జిందాల్ స్టీల్, నేషనల్ అల్యూమినియం, హిందుస్తాన్ జింక్, టాటా స్టీల్, ఎన్‌ఎండీసీ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ నేతృత్వంలో లోహ షేర్లు 6.58 శాతం వరకు నష్టపోయాయి. యూనియన్ బ్యాంక్ ఇండియా నేతృత్వంలోని ఎనిమిది బ్యాంకులతో కూడిన కన్సార్టియంను రూ. 1,394 కోట్ల మేరకు మోసగించినట్లు అభియోగం మోపుతూ టోటెమ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌పై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) కేసు నమోదు చేయడంతో బ్యాంకింగ్ రంగ షేర్ల విలువ భారీగా పడిపోయింది. నిఫ్టీ బ్యాంక్ ఇండెక్స్ ఒక్క సెషన్‌లోనే 471.10 పాయింట్లు (1.95 శాతం) పడిపోయి, సుమారు ఎనిమిది నెలల కనిష్ట స్థాయి అయిన 23,670.40 పాయింట్ల వద్ద ముగిసింది. యాక్సిస్ బ్యాంక్, పీఎన్‌బీ, యెస్ బ్యాంక్, కెనరా బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఐడీఎఫ్‌సీ బ్యాంక్, ఎస్‌బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, కోటక్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, ఇండస్‌ఇండ్ బ్యాంక్ షేర్ల ధరలు 3.87 శాతం వరకు పడిపోయాయి. రూ. 1,394 కోట్ల మోసానికి గురయిన యూనియన్ బ్యాంక్ ఇండియా షేర్ ధర 8.29 శాతం తగ్గి, రూ. 86.85 వద్ద ముగిసింది.
సెనె్సక్స్ ప్యాక్‌లోని టాటా మోటార్స్, ఎల్‌అండ్‌టీ, బజాజ్ ఆటో, డాక్టర్ రెడ్డీస్, రిల్, విప్రో, హెచ్‌డీఎఫ్‌సీ, సన్ ఫార్మా, హీరో మోటోకార్ప్, హెచ్‌యూఎల్, మారుతి సుజుకి, భారతి ఎయిర్‌టెల్, ఓఎన్‌జీసీ, ఐటీసీ, టీసీఎస్, ఎన్‌టీపీసీ 2.10 శాతం వరకు నష్టపోయాయి. అయితే ఇన్ఫర్మేషన్ టెక్నాలజి (ఐటీ), మీడియా షేర్లు లాభపడ్డాయి. అదాని పోర్ట్స్, ఇన్ఫోసిస్, పవర్‌గ్రిడ్, ఎంఅండ్‌ఎం, కోల్ ఇండియా, ఆసియన్ పెయింట్స్ షేర్ల ధరలు 0.99 శాతం వరకు పెరిగాయి.
స్థిరాస్తి రంగం నేతృత్వంలో రంగాల వారీ సూచీలు కూడ పతనమయ్యాయి. రియాల్టీ 3.31 శాతం పడిపోగా, మెటల్ 2.89 శాతం, బ్యాంకెక్స్ 2.08 శాతం, ఫైనాన్స్ 1.73 శాతం, క్యాపిటల్ గూడ్స్ 1.56 శాతం, హెల్త్‌కేర్ 1.48 శాతం, పీఎస్‌యూ 1.30 శాతం, ఎనర్జీ 1.15 శాతం, ఆటో 0.85 శాతం, చమురు- సహజ వాయువు 0.85 శాతం, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ 0.84 శాతం, పవర్ 0.68 శాతం, ఎఫ్‌ఎంసీజీ 0.64 శాతం, కన్స్యూమర్ డ్యూరేబుల్స్ 0.08 శాతం చొప్పున పడిపోయాయి. మరోవైపు, టెక్నాలజి, ఐటీ సూచీలు 0.32 శాతం పెరుగుదలతో సానుకూలంగా ముగిశాయి.