బిజినెస్

గణనీయంగా తగ్గిన కరెంట్ ఖాతా లోటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూన్ 16: గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో భారత దేశ కరెంట్ ఖాతా లోటు గణనీయంగా తగ్గింది. మూడో త్రైమాసికంలో ఈ లోటు 710 కోట్ల డాలర్లు ఉండగా నాలుగో త్రైమాసికంలో దాదాపు 30 లక్షల డాలర్ల మేరకు తగ్గిపోయింది. వాణిజ్య లోటు తగ్గడమే కరెంట్ ఖాతా లోటు తగ్గడానికి ప్రధాన కారణం. మొత్తం 2015-16 ఆర్థిక సంవత్సరానికి కరెంట్ ఖాతా లోటు స్థూల జాతీయ ఉత్పత్తి (జిడిపి)లో 1.1శాతానికి తగ్గిపోయినట్లు రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బిఐ)గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. క్రితం ఏడాది నాలుగో త్రైమాసికంలో వాణిజ్య లోటు 3160 కోట్ల డాలర్లుగా ఉండగా, 2015-16 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో అది 2480 కోట్ల డాలర్లకు తగ్గిపోయిందని రిజర్వు బ్యాంకు ఆ ప్రకటనలో స్పష్టం చేసింది.