బిజినెస్

వచ్చే ఏడాది జిడిపి వృద్ధి 7.2 శాతమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 24: భారత ఆర్థిక వ్యవస్థ 2016-17 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర గణాంక శాఖ కార్యాలయం మందస్తు అంచనా వేసిన 7.6 శాతంకన్నా తక్కువగా 7.2 శాతం వృద్ధి చెందవచ్చని బిఎంఐ రిసెర్చ్ అంచనా వేసింది. పెట్టుబడులు బలహీనంగా ఉండడం, అంతర్జాతీయంగా తలెత్తిన సమస్యలు దీనికి ప్రధాన కారణమని ఆ సంస్థ అభిప్రాయ పడింది. 2016 ఆర్థిక సంవత్సరంలో జిడిపి వృద్ధి 7.3 శాతం ఉండవచ్చని తాము ఇంతకు ముందు అంచనా వేశామని, అయితే వాస్తవానికి ఈ వృద్ధి 7.2 శాతానికి మించక పోవచ్చని బిఎంఐ రిసెర్చ్ సంస్థ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. భారత ఆర్థిక వ్యవస్థ ఇప్పటికీ అనేక రకాల సవాళ్లను ఎదుర్కొంటోందని, పారిశ్రామిక ఉత్పత్తి, వాణిజ్యం లాంటి తరచూ విడుదల చేసే గణాంకాల్లో ఇది స్పష్టంగా కనిపిస్తోందని ఆ ప్రకటన తెలిపింది. ‘ప్రైవేట్ పెట్టుబడులు బలహీనంగా ఉండడం, అంతర్జాతీయ పరిణామాలు అధిక వృద్ధి రేటుకు అడ్డంకులుగా ఉండనున్నాయి. అందువల్ల వాస్తవంగా జిడిపి వృద్ధి 2015/16 ఆర్థిక సంవత్సరంలో సాధించిన 7. 3శాతానికి బదులు 2016/17 ఆర్థిక సంవత్సరంలో 7.2 శాతమే ఉండవచ్చని తాము అంచనా వేస్తున్నట్లు ఆ ప్రకటనలో సంస్థ తెలిపింది.
ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదల చేసిన ఈ ఆర్థిక సంవత్సరపు ముందస్తు అంచనాల్లో కేంద్ర గణాంకాల కార్యాలయం జిడిపి వృద్ధి రేటు 7.6 శాతం ఉంటుందని అంచనా వేసింది. గత నెల పార్లమెంటుకు సమర్పించిన ఆర్థిక సర్వేలో అంతర్జాతీయ పరిస్థితులు సవాలుగా ఉన్నట్లు పేర్కొనడం తెలిసిందే. అయితే వచ్చే ఆర్థిక సంవత్సరంలో జిడిపి వృద్ధి 7-7.5 శాతం మధ్య ఉంటుందని, అది ఆ తర్వాతి రెండేళ్లలో వేగం పుంజుకుని 8 శాతానికి చేరుకుంటుందని కూడా ఆ సర్వే అంచనా వేసింది. అయితే ఒక వేళ ప్రపంచ ఆర్థిక పరిస్థితులు గనుక ఇదే విధంగా బలహీనంగానే ఉండిన పక్షంలో భారత్‌కు తలనొప్పులు తప్పవని కూడా ఆ సర్వే హెచ్చరించింది. అయితే 2016-17 ఆర్థిక సంవత్సరంలో భారత దేశ జిడిపి ఈ ఏడాది ఉన్న 7.6 శాతంనుంచి 7.8 శాతానికి పుంజుకుంటుందని జపాన్‌కు చెందిన ఫైనాన్షియల్ సర్వీసుల దిగ్గజం నోమురా ఇటీవల పేర్కొన్న విషయం తెలిసిందే.
కాగా మోదీ ప్రభుత్వం వరసగా ఆర్థిక సంస్కరణలు తీసుకు రావడానికే కృతనిశ్చయంతో ఉందని, రాబోయే సంవత్సరాల్లో ఆర్థికాభివృద్ధికి ఇది ఎంతో సానుకూలం అవుతుందని తాము భావిస్తున్నామని బిఎంఐ రిసెర్చ్ అభిప్రాయ పడింది. జన్‌ధన్-దార్-మొబైల్ (జమ్) ద్వారా సబ్సిడీలను తగ్గించాలని భారత ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని, ప్రభుత్వం తీసుకునే ఈ చిన్న చర్యలు లోపాలను పూడ్చడం ద్వారా సబ్సిడీల బదిలీలను మెరుగుపర్చడానికి, దీర్ఘకాలిక ద్రవ్యలోటు స్థిరీకరణకు తోడ్పడుతాయని తాము గట్టిగా భావిస్తున్నామని ఆ సంస్థ అభిప్రాయ పడింది. అంతేకాకుండా ద్రవ్యోల్బణం అదుపులోనే ఉండడం, దీనికి తోడు ప్రభుత్వం తీసుకునే ఆర్థిక క్రమశిక్షణా చర్యల కారణంగా రిజర్వ్ బ్యాంక్ తన కీలక వడ్డీ రేట్లను 2017 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి 50 బేసిస్ పాయింట్ల దాకా తగ్గించే అవకాశం ఉందని, వచ్చే ఏప్రిల్‌లో జరిగే సమీయలో కానీ, లేదా ముందుగా నిర్ణయించని సమీక్షలో కానీ 25 బేసిస్ పాయింట్లను తగ్గించవచ్చని కూడా బిఎంఐ రిసెర్చ్ ఆ ప్రకటనలో తెలిపింది.