బిజినెస్

చార్జింగ్ స్టేషన్లకు లైసెన్స్ అక్కరలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 16: విద్యుత్ వాహనాలను ప్రోత్సహించే ప్రక్రియలో భాగంగా కేంద్ర ప్రభుత్వం, ఈ వాహనాలు చార్జింగ్ బ్యాటరీలను సేవా విభాగం కింద పరిగణిస్తోంది. ఫలితంగా చార్జింగ్ స్టేషన్ల నిర్వహణకు లైసెన్సులు అవసరం లేదు. అయితే విద్యుత్ చట్టంకింద విద్యుత్ ప్రసారం, పంపిణీ, వ్యాపారం నిర్వహించడానికి లైసెన్స్ తప్పనిసరి. అందువల్ల విద్యుత్‌ను వినియోగదారులకు అమ్మే అన్ని సంస్థలు లైసెన్స్‌లు తప్పనిసరిగా తీసుకోవాలి.
కాగా ఛార్జింగ్ స్టేషన్లపై కేంద్రం వివరణ ఇచ్చింది. విద్యుత్ వాహనాలకు చార్జింగ్ చేసే ప్రక్రియలో, విద్యుత్ ప్రసారం, పంపిణీ, లేదా వాణిజ్య కార్యకలాపాలు ఏవీ ఉండటం లేదు. అందువల్ల విద్యుత్ వాహనాల చార్జింగ్ స్టేషన్లకు ఏవిధమైన లైసెన్స్ అక్కరలేదని తెల్చి చెప్పింది. ప్రభుత్వ నిర్ణయం ఎంతో సానుకూలమైందని, సొసైటీ ఆఫ్ మ్యాన్యుఫ్యాక్చరర్స్ ఆఫ్ ఎలక్రికల్ వెహికిల్స్ (ఎమ్‌ఎంఈవీ) కార్పొరేట్ వ్యవహారాల డైరెక్టర్ సోహిందర్ హిల్ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా చార్జింగ్ ఎకోసిస్టం ఏర్పాటుకు ఇది దోహదం చేస్తుందన్నారు. అయితే చార్జింగ్ స్టేషన్లకోసం భూమి సేకరణ, భౌతిక, భౌతికేతర ప్రోత్సాహకాల వంటి సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాల్సి ఉంటుంది.
గత నెల కేంద్ర పునరుత్పాదకశాఖ మంత్రి ఆర్.కె. సిం గ్ ఒక ప్రకటన విడుదల చేస్తూ, ‘విద్యుత్ వాహనాల సాంకేతిక ప్రమాణాలు, రెగ్యులేటరీ ఫ్రేమ్‌వర్క్‌లపై ఒక విధానాన్ని త్వరలో ప్రకటిస్తాం’ అని స్పష్టం చేశారు. వచ్చే 15-20 రోజుల్లో విద్యుత్ వాహనాల చార్జింగ్ వౌలిక సదుపాయాలను కల్పించేందుకు కూడా ప్రణాళికను సిద్ధం చేస్తున్నామని చెప్పారు. ప్రభుత్వం రూపొందించే ఈ విధానం వల్ల 15 శాతం ప్రయోజనం కలుగనుందని అధికార్లు చెబుతున్నారు. ఈ విధానం చార్జింగ్ యూనిట్ ధరను రూ.6 కంటే దిగువనే నిర్ణయించే అవకాశముంది. దీనికి సమానమైన పెట్రోలు, డీజిల్ ఖర్చు సగటున రూ.6.50 వరకు ఉంటోంది.
2013లో ప్రభుత్వం రూపొందించిన నేషనల్ ఎలక్ట్రిక్ మొబిలిటీ మిషన్ ప్ల్రాన్ ప్రకారం 2020 నాటికి దేశంలో 6-7 మిలియన్ల విద్యుత్, హైబ్రిడ్ వాహనాలకు వీలు కల్పిస్తోంది.