బిజినెస్

యూకో బ్యాంకులో భారీ స్కాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 16: యూకో బ్యాంకు షేర్లు సోమవారం 6 శాతం నష్టాన్ని నమో దు చేశాయి. రూ.621 కోట్ల రుణ కుంభకోణం నేపథ్యంలో యూకో బ్యాంకు మాజీ ఛైర్మన్ కమ్ మేనేజింగ్ డైరెక్టర్ అరుణ్ కౌల్ తదితరులను సీబీఐ కేసు నమోదు చేయడమే ఇందుకు కారణం. ఫలితంగా బ్యాంకు మార్కెట్ మూలధనీకరణ రూ.1,256 కోట్ల మేర పడిపోయి, రూ.3,901.79 కోట్లకు చేరుకుంది. సోమవారం బ్యాంకు షేర్లు గత 52 వారాల్లో కనిష్ఠానికి కుంచించుకుపోయాయి. బ్యాంకు షేరు ధర అత్యంత తక్కువస్థాయికి అంటే రూ.19.15కు పడిపోయి, చివరకు రూ.20.90 వద్ద ట్రేడ్ అయింది. ఇక ఎన్‌ఎస్‌ఈలో కూడా 52వారాల కనిష్టానికి యూకో బ్యాంకు షేరు పడిపోయి చివరకు రూ.20.85 వద్ద ట్రేడయింది.
రూ.621 కోట్ల మేర రుణాల మంజూరులో అక్రమాలకు బాధ్యులని ఆరోపిస్తూ కౌల్ తదితరులపై ఏప్రిల్ 14న సీబీఐ కేసులు నమోదు చేసింది. ఈ రుణాల మంజూరు వల్ల బ్యాంకు రూ.737 కోట్ల మేర నష్టపోయింది. కౌల్‌తోపాటు, ఎరా ఇంజినీరింగ్ ఇన్‌ఫ్రా లిమిటెడ్ (ఈఈఐఎల్) సీఎండీ హేమ్ సింగ్ భరానా, పంకజ్ జైన్, వందనా శారత అనే ఇద్దరు చార్టెడ్ అకౌంటెంట్లు, అల్టియుస్ ఫిన్‌సర్వ్ ప్రైవేట్ లిమిటెడ్ కు చెందిన పవన్ బన్సాల్‌లపై కూడా సీబీఐ కేసులు నమోదు చేసింది. 2010-15 మధ్యకాలంలో కౌల్ యూకో బ్యాంకు ఛైర్మన్‌గా ఉన్న కాలంలో, కోల్‌కతాకు చెందిన బ్యాంకు శాఖనుంచి అక్రమంగా రుణాలు మంజూరైనట్టు సీబీఐ ఆరోపించింది.