బిజినెస్

ఆర్థిక స్థిరత్వం అంచనాలు.. పుంజుకున్న మార్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: భారతీయ స్టాక్ మార్కెట్లు వరుసగా ఎనిమిదవరోజు కూడా లాభాల్లో ముగిసాయి. నవంబర్ నుంచి ఇంతటి దీర్ఘకాలం మార్కెట్లు లాభాల్లో నడవడం ఇదే ప్రథమం. ప్రారంభంలో మార్కెట్లు కొద్దిగా తడబడినా తర్వాత స్థూల ఆర్థిక స్థిరత్వంపై సూచనలు అందడంతో మార్కెట్లుపుంజుకొని ఇక వెనుదిరగలేదు. సోమవారం సెనె్సక్స్ ఒకదశలో 34,341.46ను తాకినా చివరకు 112.78 పాయింట్ల లాభంతో 34,305.43 వద్ద ముగిసింది. గత వారం రోజుల్లో ఈ ఇండెక్స్ 1,173.88 పాయింట్లు పెరగడం గమనార్హం. ఇక నిఫ్టీలో కూడా సోమవారం అమ్మకాలు, కొనుగోళ్లు జోరుగా సాగడంతో 10,396.35- 10,540. 15 మధ్య ఊగిసలాడి చివరకు 47.75 పాయింట్ల లాభంతో 10,528.35 వద్ద ముగిసింది.
యుఎస్ నేతృత్వంలోని సంకీర్ణ దేశాలు సిరియాపై క్షిపణి దాడులు జరపడంతో, భౌగోళికరాజకీయ ఉద్రిక్తతలు ఏర్పడిన నేపథ్యంలో, ప్రారంభంలో ఆసియన్ మార్కెట్లనుంచి సానుకూల సమాచారం అందలేదు. దీంతో దేశీయ మదుపర్లు కొనుగోళ్లపై పెద్దగా ఆసక్తి కనబరచలేదు. అయితే దేశీయ ద్రవ్యోల్బణం, పారిశ్రామిక ఉత్పత్తులకు సంబంధించి సానుకూల పరిస్థితులు ఏర్పడటంతో మార్కెట్లు కోలుకోవడం మొదలైంది. కేంద్ర ప్రభుత్వ సమాచారం ప్రకారం టోకుధరల ద్రవ్యోల్బణం మార్చిలో 2.47 శాతం వద్ద నిలకడగా ఉండింది. ఆహార ధాన్యాలు ముఖ్యంగా పప్పు్ధన్యాలు, కూరగాయల ధరలు బాగా తగ్గడం ఆర్థిక వ్యవస్థ మరింత పుంజుకోవడానికి సంకేతం కాగా, ప్రభుత్వ సమాచారం ప్రకారం పారిశ్రామిక ఉత్పత్తులు గత ఫిబ్రవరిలో 7.1 శాతం వృద్ధి నమోదు చేయగా, రిటైల్ ద్రవ్యోల్బణం మార్చి నెలలో ఐదునెల్ల కనిష్ఠానికి అంటే 4.28 శాతం నమోదైంది. కాగా ఈ ఏడాది దేశంలో సాధారణ వర్షపాతం అంటే దీర్ఘకాలిక సగటు 97 శాతంగా నమోదు కావచ్చని భారతీయ వాతావరణ శాఖ ప్రకటించడం కూడా మార్కెట్లు ఊపందుకోవడానికి దోహదం చేసింది. ముడి చమురు ధరలు కొద్దిగా ప్రతికూల ప్రభావం చూపినప్పటికీ, డబ్ల్యుపిఐ ద్రవ్యోల్బణం మార్చిలో 2.47 శాంతంగా నమోదు కావడంతో, బ్యాంకులు, ఆటో స్టాక్‌లు పుంజుకున్నాయి. ఇదిలావుండగా స్థానిక సంస్థాగత మదుపర్లు గత శుక్రవారం రూ.306.05 కోట్లవిలువైన ఈక్విటీలను కొనుగోలు చేసినట్లు ప్రాథమిక సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. అదేవిధంగా విదేశీ పోర్టుపోలియో మదుపర్లు రూ.399.59 కోట్ల విలువైన షేర్ల అమ్మకాలు జరిపారు.
రియాల్టీ, హెల్త్‌కేర్, ఎఫ్‌ఎంసీజీ, విద్యుత్, వౌలిక సదుపాయాలు, మూలధన వస్తువులు, ఆటో మరియు బ్యాంకింగ్ స్టాక్‌లు లాభాల బాటలో కొనసాగాయి. హీరో మోటోకార్పొరేషన్ లాభాల్లో అగ్రస్థానంలో ఉండగా, తర్వాతి స్థానాన్ని కోటక్ బ్యాంకు ఆక్రమించింది. ఆదాని పోర్ట్‌లు, బజాజ్ ఆటో, హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్, ఎన్‌టీపీసీ, ఐటీసీ, ఆసియన్ పెయింట్‌స, సన్ ఫార్మా, మారుతి సుజ్‌కీ, ఎల్‌అండ్ టీ, డాక్టర్ రెడ్డీస్, ఎల్ అండ్ టీ, ఎస్ బ్యాంక్, ఇండస్‌ల్యాండ్ బ్యాంకు, ఎస్ బ్యాంకుల షేర్లు లాభాల్లో నడిచాయి.
ఇక టాటామోటార్స్ బాగా నష్టపోయింది. కొన్ని ఉద్యోగాల్లో కోత విధించేందుకు ఆలోచిస్తున్నామని జాగ్వర్ ల్యాండ్ రోవర్ ప్రకటించడమే ఇందుకు కారణం. ఇంకా వెనుకబడిన వాటిల్లో ఇన్ఫోసిస్, ఎస్‌బీఐ, ఐసీఐసీఐ, ఆర్‌ఎల్‌ఎల్, భారతీ ఎయిర్‌టెల్, విప్రో, కోల్ ఇండియాలు ఉన్నాయి.