బిజినెస్

డిఫాల్ట్ నిబంధనలో వైఫల్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పూణె, ఏప్రిల్ 18: బ్యాంకు ఋణాలు తీసుకున్నవారిలో చాలామంది ఒక్కరోజు డిఫాల్ట్ నిబంధనను పాటించడంలో వైఫల్యం చెందడంపై రిజర్వ్ బ్యాంకు డిప్యూటీ గవర్నర్ ఎన్ ఎస్ విశ్వనాధన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వైఫల్యం రుణదాతలు ఒక హెచ్చరికగా పరిగణిం చి తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. పారుబాకీలు (వసూలుకాని రుణాలు) దేశ ఆర్థిక వ్యవస్థలో 10శాతాన్ని దాటిపోయిన నేపథ్యంలో, రిజర్వ్ బ్యాంకు ఫిబ్రవరి 12న పారుబాకీలపై సవరించిన ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించింది. దీని ప్రకా రం బ్యాంకులు, ఒక్కరోజు వడ్డీ చెల్లింపుబకాయిలతో సహా పారుబాకీల వివరాలకు సంబంధించి 180 రోజుల్లోగా రిజల్యూషన్ ప్లా న్ రూపొందించాలి. నిర్దేశిత కాలంలో కంపెనీ తన బాకీని చెల్లించనట్లయితే తక్షణమే దివాలా కోర్టుల్లో దాఖలు చేయాలి. ఇందుకు వీలు కల్పిస్తూ రిజర్వ్ బ్యాంకు ఇప్పటివరకు అమల్లో ఉన్న వివిధ రకాల డెబిట్ రిజల్యూషన్ మెకానిజంలను పూర్తిగా ఎత్తేసింది. 3నగదు ప్రవాహ సమస్య ఉన్న నేపథ్యంలో, పెద్ద సంస్థ అయినా ఒక్కరోజు నిబంధనను పాటించనట్లయితే దాన్ని తొలి హెచ్చరికగా పరిగణించాలని విశ్వనాధన్ స్పష్టం చేశారు. ఆర్‌బీఐ ఆధ్యర్యంలో నడిచే నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంక్ మేనేజ్‌మెంట్, 14వ స్నాతకోత్సవంలో బుధవారం పాల్గొని ప్రసంగించారు. ప్రస్తుతం అమల్లోకి తీసుకొచ్చిన కొత్త ఎన్‌పీఎ నిబంధనలు కఠినంగా ఉన్న నేపథ్యంలో వీటిని సడలించాలని ప్రభుత్వం రిజర్వ్ బ్యాంకుపై ఒత్తిడి తీసుకొస్తోంది. ముఖ్యంగా 3ఒక్కరోజు డిఫా ల్ట్‌ను 30 రోజులకు పెంచాలని కోరుతున్నట్టుగా మీడియాలో వస్తున్న వార్తల నేపథ్యంలో విశ్వనాథన్ అన్న మాటలకు ప్రాధాన్యత ఏర్పడిం ది. కొత్త నిబంధనలు ముఖ్యంగా చిన్న, మధ్యతరహా పరిశ్రమలపై ప్రతికూల ప్రభావం చూపుతాయని ప్రభుత్వం భయపడుతోంది. ఈ నిబంధన పుణ్యమాని ఆ యా సంస్థల్లో సింహభాగం నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ)కు చేరుకుంటే ఇక ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుందని ప్రభుత్వం ఆం దోళన చెందుతోంది. రిజర్వ్ బ్యాంకులో బ్యాంకింగ్ ని యంత్రణ శాఖకు అధిపతిగా ఉన్న విశ్వనాథన్ ఇంకా మాట్లాడు తూ, ఒక్కరోజు డిఫాల్ట్ అయిన వెంటనే కస్టమర్లను బ్యాంకులు హెచ్చరించాలని కోరారు. ఒక్కరోజు డిఫాల్ట్ కారణంగా తీర్మానానికి సంబంధించిన జాబితాలో తమ పేరు చేరుతుందేమోనన్న ఆందోళన కస్టమర్లలో కలగాలన్నారు. అయితే రుణ గ్రహీతలూ చెల్లింపు బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలని కోరారు. చెల్లిం పు సామర్థ్యమున్నా, ఆలస్యం కావడం సాధారణ ప్రక్రియేనన్న అభిప్రాయం నుంచి రుణ గ్రహీతలు బయటపడాలి. ఒక రుణగ్రహీత కార్పొరేట్ బాండ్‌కు సంబంధించిన కూపన్/అసలు మొత్తం చెల్లింపులో ఒక్కరోజు ఆలస్యం చేసినా, మార్కెట్ వారికి భారీ ఎ త్తున జరిమానా, రేటింగ్ తగ్గిస్తుంది. ఇంకా రుణం కావాలంటే ఖర్చు బాగా పెరుగుతుంది. దీనికితోడు మదుపర్లు కోర్టుకు వెళతా రు, ఇంతటి తీవ్రస్థాయిలో బ్యాంకింగ్ వ్యవస్థ ప్రతిస్పందించదన్న సంగతిని కస్టమర్లు గుర్తించాలన్నారు. 90 రోజులు చెల్లింపు జరగకపోతే నిరర్థక ఆస్తి కింద పరిగణిస్తారు. రుణదాతలు, గ్రహీతలు ఆవిధమైన వర్గీకరణకు గురికావద్దని ఆయన హితవు చెప్పారు.