బిజినెస్

నగదు విత్‌డ్రాకు పీఓఎస్ మెషిన్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: వివిధ వాణిజ్య ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన పీఓఎస్ మెషిన్ల నుంచి నగదును విత్‌డ్రా చేసుకోవాల్సిందిగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లను కోరింది. వివిధ రాష్ట్రాల్లో నగదుకొరత తీవ్రంగా ఉన్న నేపథ్యంలో బ్యాంకు ఈ చర్య తీసుకుంది. వేరే బ్యాంకులకు చెందిన కస్టమర్లు కూడా ఈ పీఓఎస్ మెషిన్లనుంచి తమ డెబిట్ కార్డు సహాయంతో నగదును విత్‌డ్రా చేసుకోవచ్చునని బ్యాంక్ తెలిపింది. ఉత్తర ప్రదేశ్, బిహార్, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాల్లో ఏటీఎంలు పనిచేయకపోవడమో లేక నగదు లేదన్న సైన్‌బోర్డులతోనే కనిపించాయి. ఢిల్లీలో కూడా కొన్ని ఏటీఎంల ముందు ఔట్ ఆఫ్
సర్వీస్ బోర్డులు కనిపించాయి. కాగా దేశంలో నగదుకొరత తీవ్రరూపం దాల్చిన నేపథ్యంలో ఎస్‌బీఐ పై చర్య తీసుకుంది.
ఇక ఆర్‌బీఐ మార్గదర్శకాల ప్రకారం టైర్-1, టైర్-2 నగరాల్లో కస్టమర్లు రోజుకు రూ.1000 వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు. టైర్-3, టైర్-4 పట్టణాల్లో రూ.2000వరకు విత్‌డ్రా చేసుకునే వీలు కల్పించింది. అయితే తాను వసూలు చేసే ఫీజులు ప్రస్తుతానికి ఏవిధమైన మార్పు చేయడం లేదని ఎస్‌బీఐ స్పష్టం చేసింది. ఎస్‌బీఐకు మొత్తం 6,08 పీఓఎస్ మెషీన్లుండగా, వాటిల్లో 4.78 లక్షల మెషిన్లను నగదు విత్‌డ్రా చేసుకునేందుకు అనువుగా మలచారు.
నోట్ల రద్దుకు ముందు దేశంలో రూ.17.97 లక్షల కోట్ల కరెన్సీ చెలామణిలో ఉండగా, ప్రస్తుతం రూ.18.43 లక్షల కోట్ల కరెన్సీ చెలామణిలో ఉన్నదని ప్రభుత్వం చెబుతోంది. అయినప్పటికీ నగదు కొరత ఏర్పడటం విచిత్రం. ఇదిలావుండగా ఈ సమస్యను ఎదుర్కొనేందుకు వీలుగా నగదు ప్రింటింగ్‌ను 24 గంటలూ కొనసాగిస్తున్నారు.