బిజినెస్

19కోట్ల మందికి బ్యాంకు ఖాతాల్లేవు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్: అందరికీ బ్యాంకు ఖాతాలు ఉండాలన్న లక్ష్యంతో జన్‌ధన్ వంటి పథకాలు అమలుచేస్తున్నా 19 కోట్ల మంది భారతీయులకు బ్యాంకు ఖాతాలే లేవు. ప్రపంచ బ్యాంక్ గురువారం ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ విషయంలో చైనా తరువాత స్థానం భారత్‌దే. అంతేకాదు గత ఏడాదికి సగానికి సగం బ్యాంకు ఖాతాల్లో ఎలాంటి కార్యకలాపాలు జరగడం లేదని తేలింది. దేశంలో ప్రతి ఒక్కరికీ బ్యాంకు ఖాతాలు కల్పించాలన్న ఉద్దేశంతో కేంద్రం జన్‌ధన్ పథకాన్ని అట్టహాసంగా ప్రారంభించింది. 2018 మార్చి నాటికి 31 కోట్ల మందిని అదనంగా పథకం పరిధిలోకి తీసుకురావాలని లక్ష్యంగా నిర్ణయించింది. నరేంద్ర మోదీ ప్రభుత్వం 2014లో జన్‌ధన్ పథకాన్ని ప్రారంభించింది. ప్రపంచ బ్యాంకు విడుదల చేసిన గ్లోబల్ ఫిండెక్స్ డేటాబేస్ ప్రకారం ప్రపంచంలో అన్‌బ్యాంకింగ్ అడల్ట్స్‌లో భారత్‌లోనే 11 శాతం మంది ఉన్నారు. ప్రపంచ వ్యాప్తంగా 69 శాతం మంది అంటే 3.8 బిలియన్ల మంది బ్యాంకులతో సంబంధాలు కలిగి ఉన్నారు. ఖాతాల పరంగా గానీ, మొబైల్ మనీ ప్రొవైడర్లుగా ఉన్నారు. 2011లో 51 శాతం ఉన్న ఈ తరహా ఖాతాలు 2014కి 62 శాతానికి ఎగబాకాయి. 2014 నుంచి 2017 మధ్యకాలంలో 515 మిలియన్ల మంది ఖాతాదారులయ్యారు. ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న చైనాలో 225 మిలియన్న మందికి బ్యాంక్ ఖాతాలే లేవని గ్లోబల్ ఫిండెక్స్ వెల్లడించింది. భారత్‌లో 190 మిలియన్ల మంది అంటే 19 కోట్ల మందికి ఏ బ్యాంకు ఖాతాలూ లేవు. పాకిస్తాన్‌లో 100 మిలియన్లు, ఇండోనేసియాలో 95 మిలియన్ల మందికి బ్యాంక్ ఖాతాలులేవు. భారత్‌లో నరేంద్ర మోదీ ప్రభుత్వం అర్హులందరికీ బ్యాంక్ ఖాతాలు కల్పించాలన్న ఉద్దేశంతో జన్‌ధన్ తీసుకొచ్చి బయోమెట్రిక్ ఐడీ కార్డులు ప్రవేశపెట్టిందని ప్రపంచ బ్యాంక్ పేర్కొంది. అయితే సగం అకౌంట్లలో ఎలాంటి ఎలాంటి జమ/ విత్‌డ్రాలు లేకుండా నిద్రాణంగానే ఉన్నాయని నివేదికలో వెల్లడించారు. జన్‌ధన్‌తో కొత్త ఖాతాదారులయితే వచ్చారు గానీ వాటిని సద్వినియోగం చేసుకున్న దాఖలాలు తక్కువే.