బిజినెస్

సింగరేణి సీపీఆర్‌వోకు పీఆర్ మేనేజర్ అవార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 20: సింగరేణి కాలరీస్ సంస్థ జనరల్ మేనేజర్, ముఖ్య ప్రజా సంబంధాల అధికారి జనగామ నాగయ్య ప్రతిష్టాకరమైన డాక్టర్ సివి నరసింహారెడ్డి పీఆర్ మేనేజర్ అవార్డుకు ఎంపికయ్యారు. పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ ఆఫ్ ఇండి యా హైదరాబాద్ చాప్టర్ వారి ఆధ్వర్యంలో ప్రతి ఏటా నిర్వహించే ఈ పోటీల్లో 2018 సంవత్సరానికి ఆయన ఎంపికయ్యారు. ఈ నెల 21వ తేదీన జరిగే కార్యక్రమంలో ఈ అవార్డును జనగామ నాగయ్యకు ప్రదానం చేస్తారు. ఈ అవార్డుకు ఎంపికైన జనగామ నాగయ్య ఎఎంఐఇ మైనింగ్, ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఎంబిఏ హెచ్‌ఆర్ ఉత్తీర్ణులయ్యారు. సింగరేణి సంస్థలో 1980లో మైనింగ్ ఇంజనీర్‌గా చేరిన నాగయ్య వివిధ ఏరియాల్లో, వివిధ హోదాల్లో పనిచేస్తూ తన కృషి, ప్రతిభతో అంచలంచెలుగా పదోన్నతులతో 2010లో జనరల్ మేనేజర్ స్థాయికి ఎదిగారు. 2016 నుంచి హైదరాబాద్‌లో సింగరేణి సంస్థలో జిఎం కో ఆర్డినేషన్‌గా, సిపిఆర్‌వోగా పనిచేస్తున్నారు. ఈ సంస్థ లో ప్రజా సంబంధ విభాగాలను పటిష్టం చేశారు. కార్మికులకు ఉపయోగపడే సమాచారాన్ని సరళమైన భాషలో తెలియచేస్తూ మంచి పేరు తెచ్చుకున్నారు.

చిత్రం..అవార్డుకు ఎంపికైన సింగరేణి ముఖ్య ప్రజాసంబంధాల అధికారి జనగామ నాగయ్య