బిజినెస్

స్టాక్ మార్కెట్లకు స్వల్ప నష్టాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఏప్రిల్ 20: దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం ఎదుగూబొదుగా లేకుం డా స్వల్ప నష్టాలతో ముగిశాయి. జూన్‌లో కఠిన వైఖరిని అవలంబించబోతున్నట్టు ఇటీవల జరిగిన రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) సమావేశ మినట్స్ సూచనప్రాయంగా వెల్లడించడంతో వడ్డీ రేట్లు పెరగనున్నాయనే ఆందోళన మదుపరులను పట్టుకుంది. దీని ప్రభావం శుక్రవారం దేశీయ స్టాక్ మార్కెట్లపై ప్రతికూలంగా పడింది. అయితే, దేశంలోనే అతిపెద్ద సాఫ్ట్‌వేర్ ఎక్స్‌పోర్టర్ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికంలో తన నికర లాభం 4.4 శాతం వృద్ధితో రూ. 6,904 కోట్లకు చేరిందని గురువారం ప్రకటించడంతో శుక్రవారం టెక్నాలజి షేర్ల ధరలు బాగా పెరిగాయి. సెనె్సక్స్ ప్యాక్‌లోని సంస్థల్లో టీసీఎస్ షేర్ ధర శుక్రవారం అత్యధికంగా 6.76 శాతం పెరిగింది. ఇన్ఫోసిస్ 4.02 శాతం లాభంతో రెండో స్థానంలో నిలిచింది. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్ 34,311.29- 34,487.33 పాయింట్ల మధ్య కదలాడి, చివరకు క్రితం ముగింపుతో పోలిస్తే 11.71 పాయింట్ల (0.03 శాతం) దిగువన 34,415.58 పాయింట్ల వద్ద ముగిసింది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) నిఫ్టీ కూడా క్రితం ముగింపుతో పోలిస్తే 1.25 పాయింట్ల (0.01 శాతం) దిగువన 10,564.05 పాయింట్ల వద్ద స్థిరపడింది. అంతకు ముందు ఈ సూచీ 10,527.45- 10,582.35 పాయింట్ల మధ్య కదలాడింది. అయితే, ఈ రెండు సూచీలు కూడా వరుసగా నాలుగో వారం పుంజుకున్నాయి. సెనె్సక్స్ ఈ వారంలో 222.93 పాయింట్లు (0.65 శాతం) పుంజుకోగా, నిఫ్టీ 83.45 పాయింట్లు (0.80 శాతం) పుంజుకుంది. ఇదిలా ఉండగా, గురువారంనాటి లావాదేవీల్లో ఫారిన్ పోర్ట్ఫోలియో ఇనె్వస్టర్లు (ఎఫ్‌పీఐలు) రూ. 624.99 కోట్ల విలువయిన షేర్లను విక్రయించగా, దేశీయ సంస్థాగత మదుపరులు రూ. 448.61 కోట్ల విలువయిన షేర్లను కొనుగోలు చేశారు. స్టాక్ మార్కెట్ల నుంచి విదేశీ నిధులు పెద్ద మొత్తంలో తరలిపోవడం, ఇటీవల ధరలు పెరిగిన షేర్లలో మదుపరులు లాభాల స్వీకరణకు పూనుకోవడం, అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరగడం వంటి అంశాలు శుక్రవారం స్టాక్ మార్కెట్‌లో ప్రతికూల ధోరణి నెలకొనడానికి ప్రధాన కారణాలని బ్రోకర్లు పేర్కొన్నారు. శుక్రవారం నాటి లావాదేవీల్లో సెనె్సక్స్ ప్యాక్‌లోని యెస్ బ్యాంక్ అత్యధికంగా మూడు శాతం నష్టపోయింది. ఐసీఐసీఐ బ్యాంక్ 2.49 శాతం నష్టంతో తరువాత స్థానంలో నిలిచింది. నష్టపోయిన ఇతర సంస్థల్లో టాటా స్టీల్, ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్, ఎన్‌టీపీసీ, ఎల్‌అండ్‌టీ, రిల్, అదాని పోర్ట్స్, యాక్సిస్ బ్యాంక్, ఆసియన్ పెయింట్స్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, సన్ ఫార్మా, డాక్టర్ రెడ్డీస్, ఓఎన్‌జీసీ, మారుతి సుజుకి, పవర్ గ్రిడ్, ఐటీసీ ఉన్నాయి. ఈ సంస్థల షేర్ల విలువ 2.29 శాతం వరకు పడిపోయింది. రంగాల వారీగా చూస్తే, రియల్టీ 1.07 శాతం, బ్యాంకెక్స్ 1.04 శాతం, పవర్ 0.98 శాతం, పీఎస్‌యూ 0.88 శాతం, క్యాపిటల్ గూడ్స్ 0.88 శాతం, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ 0.76 శాతం, మెటల్ 0.65 శాతం, చమురు- సహజ వాయువు 0.64 శాతం చొప్పున పడిపోయా యి. ఇందుకు భిన్నంగా బీఎస్‌ఈ ఐటీ ఇండెక్స్ భారీగా 4.80 శాతం పుంజుకుంది. టెక్నాలజి, వాహన రంగాల షేర్ల ధరలు బాగా పెరిగాయి.