బిజినెస్

సీఐఎల్ సీఎండీగా సురేశ్ కుమార్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అతి పెద్ద బొగ్గు గని సంస్థ కోల్ ఇండియా లిమిటెడ్ (సీఐఎల్) కొత్త యాక్టింగ్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ) గా సీనియర్ బ్యూరోక్రాట్ సురేశ్ కుమార్ నియమితులయ్యే అవకాశాలు ఉన్నాయి. నిరుడు సెప్టెంబర్ నుంచి కోల్ ఇండియా సీఎండీగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న గోపాల్ సింగ్ స్థానంలో సురేశ్ కుమార్ నియమితులు కానున్నారు. ప్రభుత్వ రంగ సంస్థ అయిన కోల్ ఇండియా అనుబంధ సంస్థ సెంట్రల్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ అధిపతిగా సింగ్ ఉన్నారు.
సురేశ్ కుమార్ ప్రస్తుతం బొగ్గు మంత్రిత్వ శాఖలో అదనపు కార్యదర్శిగా పనిచేస్తున్నారు. సురేశ్ కుమార్ సీఐఎల్ సీఎండీగా అదనపు బాధ్యతలు నిర్వహించేందుకు క్యాబినెట్ అపాయింట్‌మెంట్స్ కమిటీ ఆమోదం తెలిపిందని అధికార వర్గా లు పేర్కొన్నాయి. సీఐఎల్‌కు రెగ్యులర్ సీఎండీని నియమించే వరకు లేదా తదుపరి ఆదేశాలు వెలువడే వరకు సురేశ్ కుమార్ ఈ అదనపు బాధ్యతలు నిర్వహిస్తారని ఆ వర్గాలు తెలిపాయి. సీఐఎల్ అప్పటి సీఎండీ సుతీర్థ భట్టాచార్య 2017 ఆగస్టు 31న పదవీవిరమణ పొందారు. అప్పటి నుంచి భట్టాచార్య స్థానంలో సింగ్ సీఐఎల్ సీఎండీగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు.