బిజినెస్

చిన్న పరిశ్రమలకు రుణాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 21: దక్షిణాది రాష్ట్రాల్లో కుటీర, చిన్న పరిశ్రమలకు రుణాలు ఇచ్చే లక్ష్యంతో ఈ ఏడాది అదనంగా 15 బ్రాంచిలను ఏర్పాటు చేయనున్నట్లు ఆయ్ ఫైనాన్స్ సంస్థ ప్రకటించింది. ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాల్లో తమకు 19 బ్రాంచిలు ఉన్నాయని, ఈ ఏడాది 7 బ్రాంచిలను తెలంగాణలో నెలకొల్పనున్నట్లు ఆయ్ ఫైనాన్స్ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ విక్రమ్ జైట్లీ తెలిపారు. ఇప్పటికే కర్నాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లో తమ శాఖలను విస్తరించినట్లు ఆయన చెప్పారు. ఇంతవరకు దేశం లో తమ సంస్థ చిన్న పరిశ్రమలకు రుణాలు ఇచ్చేందుకు ,మైక్రో బిజినెస్ నిమిత్తం రూ. 500 కోట్లను పంపిణీ చేశామన్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో వంద కోట్లు పంపిణీ చేశామన్నారు. ఈ రాష్ట్రాల్లో తమకు మంచి స్పందన లభిస్తోందన్నారు. తమ సంస్థ దేశం లో 2014లో ప్రారంభించామన్నారు. వినూత్నమైన ఆర్థిక ఉత్పత్తులను మార్కెట్‌లో ప్రవేశపెట్టామన్నారు.
హైదరాబాద్‌లో వెదర్‌సీల్ ఉత్పత్తుల స్టోర్
హైదరాబాద్‌లో పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా తయారుచేసిన యుపివిసి డోర్, విండో ఉత్పత్తుల విక్రయ స్టోర్‌ను ఏర్పాటు చేసినట్లు ఆ సంస్థ సిఇవో హరీష్ మునిరెడ్డి చెప్పారు. దేశంలో టాప్ ఆర్కిటెక్ట్స్‌లు, ఇంజనీర్లు, బిల్డర్ల ద్వారా 18వేల విండోస్‌ను నెలకొల్పామన్నారు. యూరోపియన్ ఆటోమేటెడ్ మెషినరీతో తయా రు చేస్తున్నామన్నారు. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ కింగ్‌స్టన్ హైట్స్‌లో వెదర్‌సీల్‌ను ఏర్పాటు చేశామన్నారు. స్మార్ట్ సిటీస్‌లో పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన పెరగడంతో ఆధునిక అవసరాలకు తగ్గట్టుగా యుపివిసి డోర్, విండోస్‌ను తయారు చేస్తున్నట్లు చెప్పారు. ఉష్ణోగ్రతలను తట్టుకునే శక్తి ఉన్న నిర్మాణాలకు మంచి స్పందన లభిస్తోందన్నారు.