బిజినెస్

గరిష్ట స్థాయికి పెట్రో ధరలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 22: కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత గత నాలుగేళ్లలో ఎన్నడూలేని రీతిలో పెట్రో ధరలు పెరిగిపోయాయి. పెట్రోల్ ధర లీటర్‌కు రూ.74.40 పైసలకు చేరుకోగా, డీజిల్ ధర రికార్డుస్థాయిలో రూ.65.65 పైసలకు చేరింది. పెట్రో ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో తక్షణమే వినియోగదారులకు ఉపశమనం కలిగించే రీతిలో ఎక్సైజ్ సుంఖాన్ని తగ్గించాలన్న డిమాండ్ మొదలైంది. దైనందిన ప్రాతిపదికగా పెట్రో ధరలను పెంచుతూ వచ్చిన ప్రభుత్వరంగ ఇంధన సంస్థలు తాజాగా పెట్రో ధరను లీటర్‌కు 19 పైసలు పెంచాయి. పెరిగిన ధరలతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోలు రూ.74.4 పైసలకు చేరుకుంది.