బిజినెస్

కార్పొరేట్ కంపెనీల ఫలితాలే కీలకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 22: భారతి ఎయిర్‌టెల్, విప్రో, రిలయన్స్ ఇండస్ట్రీస్, యాక్సిస్ బ్యాంక్ వంటి బ్లూచిప్ కంపెనీల నాలుగో త్రైమాసిక ఫలితాలతో పాటు అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు సోమవారం నుంచి మొదలయ్యే వచ్చే వారం దేశీయ స్టాక్ మార్కెట్ గమనాన్ని నిర్దేశించనున్నాయనేది నిపుణుల అంచనా. 3రానున్న వారాల్లో స్టాక్ మార్కెట్లు రానున్న ఎన్నికల షెడ్యూల్‌తో పాటు కార్పొరేట్ కంపెనీల త్రైమాసిక ఫలితాలు, ముడి చమురు ధరలపై తమ దృష్టిని కొనసాగిస్తాయి. పెరుగుతున్న చమురు ధరలు ప్రభుత్వం అంచనా వేసిన ద్రవ్య లోటు, కరెంటు ఖాతా లోటుకు కూడా ముప్పుగా పరిణమిస్తాయి2 అని కోటక్ సెక్యూరిటీస్ పరిశోధన విభాగం వైస్ ప్రెసిడెంట్ టీనా విర్మాని పేర్కొన్నారు. డెరివేటివ్‌ల కాల పరిమితి గురువారంతో ముగియనుండటంతో వచ్చే వారంలో స్టాక్ మార్కెట్ల లావాదేవీలలో అనిశ్చితి నెలకొనే అవకాశం ఉంది. 3వచ్చే వారం వెలువడనున్న కార్పొరేట్ కంపెనీల నాలుగో త్రైమాసిక ఫలితాలు స్టాక్ మార్కెట్ బ్రెడ్త్‌ను ప్రభావితం చేయనున్నాయి. అందువల్ల వచ్చే వారం షేర్ల ఆధారిత లావాదేవీలు మరింతగా పెరగనున్నాయి. ఆయా కంపనీలు సాధించిన లాభాలను బట్టి వాటి షేర్ల ధరలు మారుతాయి2 అని ఎపిక్ రీసెర్చ్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సీఈఓ) ముస్త్ఫా నదీమ్ పేర్కొన్నారు. 3వచ్చే వారం డెరివేటివ్‌ల గడువు ముగియనుండటంతో పాటు పలు కంపనీల వార్షిక ఫలితాలు వెలువడనున్నందున మార్కెట్‌లో అనిశ్చితి నెలకొని ఉంటుంది2 అని రిలయన్స్ సెక్యూరిటీస్ సీనియర్ అనలిస్ట్ వికాస్ జైన్ పేర్కొన్నారు. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్ శుక్రవారంతో ముగిసిన ఈ వారంలో 222.93 పాయింట్లు (0.65 శాతం) పుంజుకొని 34,415.58 పాయింట్ల వద్ద ముగిసింది. వచ్చే వారం ఆర్థిక ఫలితాలు వెలువరించనున్న ప్రధాన కంపనీలలో యాక్సిస్ బ్యాంక్, యెస్ బ్యాంక్, మారుతి సుజుకి ఇండియా ఉన్నాయి. 3స్థూల, సూక్ష్మార్థిక అంశాల మధ్య పోరును మార్కెట్లు చవిచూస్తున్నాయి. అమెరికా సిరియాపై గగనతల దాడులను ప్రారంభించడంతో ప్రపంచ స్థాయిలో ఉద్రిక్తతలు ఉన్నాయి. దీంతో పాటు రూపాయి విలువ పడిపోవడం, పరిమితమయిన ద్రవ్య ఫ్లెక్లిబిలిటి, ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలకు సంబంధించిన సంఘటనలు వంటి దేశీయ పరిణామాలు స్టాక్ మార్కెట్ల ఎదుగుదలకు ప్రతిబంధకంగా ఉన్నాయి. 3మార్కెట్ కీలక సూచీలు పరిమితమయిన లావాదేవీల మధ్య తిరుగాడటానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయని ఇవన్నీ సూచిస్తున్నాయి2 అని సామ్‌కో సెక్యూరిటీస్ వ్యవస్థాపకుడు, సీఈఓ జమీత్ మోదీ పేర్కొన్నారు.