బిజినెస్

రెండోరోజూ తగ్గిన బంగారం ధర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఏప్రిల్ 24: ముంబయి బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు వరుసగా రెండో సెషన్‌లో మంగళవారం తగ్గాయి. స్టాకిస్టులు తమ నిల్వలు తగ్గించుకోవడంతో పాటు స్థానికుల నుంచి కొనుగోళ్లు తగ్గడం వల్ల బంగారం ధరలు తగ్గాయి. వెండి ధర కూడా కిలోకు రూ. 40వేల స్థాయికన్నా కిందకు పడిపోయింది. వెండి ధర రూ. 760 పడిపోయి, కిలోకు రూ. 39,270 వద్ద ముగిసింది. స్పెక్యులేటర్లు ఎడతెరిపి లేకుండా విక్రయాలకు పూనుకోవడంతో పాటు పారిశ్రామిక వర్గాల నుంచి డిమాండ్ తగ్గడం వల్ల వెండి ధర పడిపోయింది. స్టాండార్డ్ బంగారం (99.5 శాతం స్వచ్ఛత) ధర సోమవారంతో పోలిస్తే పది గ్రాములకు రూ. 80 తగ్గి, రూ. 31,150 వద్ద ముగిసింది. ప్యూర్ గోల్డ్ (99.9 శాతం స్వచ్ఛత) ధర కూడా సోమవారంతో పోలిస్తే పది గ్రాములకు రూ. 80 తగ్గి, రూ. 31,300 వద్ద ముగిసింది. వెండి (.999 స్వచ్ఛత) ధర సోమవారం ముగింపుతో పోలిస్తే కిలోకు రూ. 760 తగ్గి, రూ. 39,270 వద్ద స్థిరపడింది.